Toothbrush: టూత్‌ బ్రష్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?

How Often Should You Change Your Toothbrush
x

Toothbrush: టూత్‌ బ్రష్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?

Highlights

Toothbrush: ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత అందరూ బ్రష్ చేస్తారు. అయితే కొందరు బాగా అరిగిపోయేదాక బ్రష్‌ను ఉపయోగిస్తూ ఉంటారు.

Toothbrush: ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత అందరూ బ్రష్ చేస్తారు. అయితే కొందరు బాగా అరిగిపోయేదాక బ్రష్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ 3 నెలలకు మించి బ్రష్ వాడకపోవడమే మంచిదందటున్నారు నిపుణులు. ఎక్కువ కాలం పాటు అదే టూత్ బ్రష్ ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

దంత సంరక్షణ విషయంలో రోజూ బ్రష్ చేయడం ఎంత ముఖ్యమో, సమయానికి బ్రష్ మార్చడమూ అంతే ముఖ్యం. వ్యక్తిగత పరిశుభ్రత విషయానికొస్తే కొంతమందికి ప్రాథమిక విషయాలపై అవగాహన ఉండదు. మంచి టూత్ బ్రష్ ఉపయోగించడం, మంచి సబ్బు ఉపయోగించడం వంటి చిన్న చిన్న వాటిని విస్మరిస్తూ ఉంటారు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం, దంత సమస్యల నుంచి రక్షణ పొందడానికి.. టూత్ బ్రష్‌ను నిర్ణీత వ్యవధిలో మార్చడం చాలా ముఖ్యం. టూత్ బ్రష్ అరిగిపోయినా, రంగు మారినా వెంటనే దాన్ని మార్చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలి. కానీ కొన్ని సందర్భాల్లో దానిని 1, 2 నెలలకు మించి వాడకూడదని చెబుతున్నారు. ఎక్కువ కాలం వాడితే బ్యాక్టియా ఎఫెక్టివ్‌గా తొలగదు. పైగా దంతాలు రక్తస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. చిగుళ్లు వాపు వస్తుంది. అందుకే టూత్ బ్రష్ 2 నెలల్లో మార్చాలి. అంతేకాదు టూత్ బ్రష్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా మృదువుగా, మధ్యస్థ పళ్లతో కూడిన బ్రష్‌ను కొనాలి. దంతాల ఆకృతిని బట్టి టూత్ బ్రష్‌ను ఎంచుకోవాలి. దంతాల సమస్యలు ఉంటే దంతవైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి అంటు వ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్‌‌ను కచ్చితంగా మార్చాలని చెబుతున్నారు. బాక్టీరియా, వైరస్‌లు టూత్ బ్రష్ పళ్లపై ఉంటాయి. ఇది మళ్లీ ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాన్ని పెంచుతుంది. అనారోగ్యం తర్వాత బ్రష్ మారిస్తే.. బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. నోటి ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. నోటి శస్త్ర చికిత్స, రూట్ కెనాల్ థెరపీ, చిగుళ్ల వ్యాధికి చికిత్స వంటి పంటి చికిత్సల తర్వాత.. బ్రష్ కచ్చితంగా మార్చాలని నిపుణులు అంటున్నారు. వైద్యం చేసిన ప్రాంతంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు తగ్గించడానికి కొత్త బ్రష్ వాడటం మంచిది.

ముఖ్యంగా పిల్లల టూత్ బ్రష్‌లు పెద్దవారి టూత్ బ్రష్‌ల కంటే చిన్నగా, మృథువుగా ఉంటాయి. వారి బ్రష్‌ను త్వరగా మార్చేయడం మంచిదని సూచిస్తున్నారు. అంతే కాదు బ్రష్‌లు స్టాండ్‌లో పెట్టేటప్పుడు ఒకదానికొకటి తాకకుండా పెట్టడం ఉత్తమం అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories