Lifestyle: ఊబకాయం శృంగార జీవితంపై ప్రభావం చూపుతుందా.? నిపుణులు ఏమంటున్నారంటే

How obesity can affect on couples romantic life, know what experts say
x

Lifestyle: ఊబకాయం శృంగార జీవితంపై ప్రభావం చూపుతుందా.? నిపుణులు ఏమంటున్నారంటే 

Highlights

అయితే ఊబకాయం వల్ల శృంగార పరమైన అంశాల్లో కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. శారీరక శ్రమ తగ్గడం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం ఎన్నో రకాల ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిసిందే. గుండెకు సంబంధించిన సమస్యతకు ప్రధాన కారణం ఊబకాయంగా చెబుతుంటారు. అయితే ఊబకాయం వల్ల శృంగార పరమైన అంశాల్లో కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. లైంగిక జీవితాన్ని ఊబకాయం ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఊబకాయం లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది.? నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అధిక బరువు ఉన్న పురుషులు, స్త్రీలు ఎక్కువ సమయం సెక్స్‌ డ్రైవ్‌ను కలిగి ఉండరని నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం శరీరంలోని అధిక మొత్తంలో ఉండే కొవ్వు సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్‌ను ప్రభావితం చేస్తుంది. ఇది సెక్స్‌ డ్రైవ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

* ఊబకాయం పురుషుల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారిలో అంగస్థంభన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో లైంగిక పరమైన జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఊబకాయంతో బాధపడేవారు భాగస్వామితో ఎక్కువ సమయం గడలపేరని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు కారణంగా సెక్స్‌ డ్రైవ్‌ తగ్గడంతో పాటు ఎక్కువ భంగిమలను ప్రయత్నించలేరు. దీంతో ఇది భాగస్వాముల్లో సంతృప్తి భావన కలగదని నిపుణులు అంటున్నారు.

* అంటే అధిక బరువుతో బాధపడేవారు లైంగికంగా కలిసే సమయంలో త్వరగా అలసిపోయే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా లైంగిక జీవితంపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఇవి పాటించండి..

ఊబకాయంతో బాధపడుతున్న వారు కచ్చితంగా జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నూనె ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే ఫాస్ట్‌ ఫుడ్‌, ప్యాకేజీడ్‌ ఫుడ్‌ను తగ్గించాలి. వీటిలో పాటు వ్యాయామాన్ని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ వాకింగ్ చేయాలి. కేవలం ఊబకాయం మాత్రమే కాకుండా ఒత్తిడి కూడా లైంగిక జీవితంపై ప్రభావం చూపుతందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు, సలహాలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories