Diabetic Patients: షుగర్‌ పేషెంట్లు వారానికి ఎన్ని గుడ్లు తినాలి.. ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది..?

How many Eggs should Diabetic Patients Eat per week What happens if you Eat too Much
x

Diabetic Patients: షుగర్‌ పేషెంట్లు వారానికి ఎన్ని గుడ్లు తినాలి.. ఎక్కువగా తింటే ఏం జరుగుతుంది..?

Highlights

Diabetic Patients: భారతదేశంలో రోజు రోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. దీనికి జీవన విధానమే కారణం.

Diabetic Patients: భారతదేశంలో రోజు రోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. దీనికి జీవన విధానమే కారణం. షుగర్‌ అనేది దీర్ఘకాలిక వ్యాధి దీనిని ఆహార నియమాలతో కంట్రోల్‌లో ఉంచుకోవడం బెస్ట్‌. మందుల ద్వారా తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. అందుకే రోజువారీ డైట్‌లోకచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా గుడ్ల విషయంలో కొన్ని విషయలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందిపడే అవకాశాలు ఉంటాయి. షుగర్‌ పేషెంట్లు వారానికి ఎన్ని గుడ్లు తినాలో ఈ రోజు తెలుసుకుందాం.

గుడ్లలో ఉండే కొవ్వు ఆమ్లాలు మధుమేహాన్ని పెంచుతాయని, కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయని కొందరు నమ్ముతారు. మరికొంతమంది శరీర పోషణకు గుడ్లు తినడం చాలా మంచిదని వాదిస్తారు. అయితే ఫిన్లాండ్ విశ్వవిద్యాలయంలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం డయాబెటిక్ పేషెంట్లు కోడిగుడ్లను పరిమితంగా తినవచ్చు. ఇది శరీరానికి పోషకాహారాన్ని అందించడమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.

గుడ్డు సంపూర్ణ ఆహారం

పాల మాదరి గుడ్డు కూడా సంపూర్ణ ఆహారంగా చెబుతారు. రోజూ గుడ్లు తినేవారి రక్తంలో కొంత మొత్తంలో లిపిడ్ ప్రొఫైల్ ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినవచ్చని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపింది. ఒక గుడ్డులో 0.5 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. గుడ్లు తినడం వల్ల బయోటిన్ పెరుగుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి మంచిది. అంతేకాకుండా గుడ్లలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.

ఎన్ని గుడ్లు తినాలి..?

డయాబెటిక్ పేషెంట్లు వారానికి మూడు గుడ్లు తింటే చాలు. దీని వల్ల వారికి ఎలాంటి హాని ఉండదు. అయితే ఆహారంలో గుడ్లు తీసుకున్నప్పుడు నూనె తగ్గించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories