Heath Tips: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. ఏ సమయంలో తింటే బెటర్..!

How Many Eggs Should be Eaten per day Eating at any Time is Good for Health
x

Heath Tips: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. ఏ సమయంలో తింటే బెటర్..!

Highlights

Heath Tips: సండే అయినా మండే అయినా గుడ్డు తినండి అనే యాడ్‌ టీవీలో చూసే ఉంటాం.

Heath Tips: సండే అయినా మండే అయినా గుడ్డు తినండి అనే యాడ్‌ టీవీలో చూసే ఉంటాం. గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని సూపర్‌ఫుడ్‌ అని పిలుస్తారు. అన్ని వయసుల వారు గుడ్డు తినవచ్చు. గుడ్డు ఒక పోషకమైన ఆహారం. ఇది ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. గుడ్లలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. గుడ్లలో శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి12, కోలిన్ ఉంటాయి. అయితే గుడ్లు తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి మీకు తెలిసి ఉండవచ్చు. కానీ రోజుకు ఎన్ని గుడ్లు తినాలో చాలామందికి తెలియదు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఒక రోజులో ఎన్ని గుడ్లు తినాలి?

ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక గుడ్డులో 7 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి, రోజుకు రెండు మూడు గుడ్లు తినడం వల్ల శరీరానికి దాదాపు 14 నుంచి 21 గ్రాముల ప్రొటీన్లు అందుతాయి. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని తీర్చడానికి ఈ మొత్తం సరిపోతుంది. ఎక్కువ ప్రొటీన్లు అవసరమయ్యే వ్యక్తులు (అథ్లెట్లు లేదా వ్యాయామం చేసే వ్యక్తులు ) రోజుకు నాలుగు నుంచి ఐదు గుడ్లు తీసుకోవాలి. ఇది వారి ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.

గుడ్లు ఏ సమయంలో తినాలి?

ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం గుడ్లు తినడానికి ఉత్తమ సమయం ఉదయం టిఫిన్‌ తినే సమయం. గుడ్లలో ప్రోటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి ఆకలిని తగ్గిస్తాయి. టిఫిన్‌గా గుడ్లు తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అదనపు కేలరీలను తీసుకోకుండా నివారించవచ్చు. ఇది కాకుండా వ్యాయామం చేసిన కొంత సమయం తర్వాత గుడ్లు తినవచ్చు. గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది ఇది కండరాల పునరుద్ధరణ, పెరుగుదలకు సహాయపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అందుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories