EGG Side Effects: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. పచ్చ సొనతో ప్రమాదం ఎవరికి? పూర్తి వివరాలు మీకోసం..!

How Many Egg Should Be Eaten in One Day
x

EGG Side Effects: రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.. పచ్చ సొనతో ప్రమాదం ఎవరికి? పూర్తి వివరాలు మీకోసం..

Highlights

గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మందికి అల్పాహారంగా కూడా గుడ్లను తీసుకుంటుంటారు. అదే సమయంలో, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కూడా ప్రోటీన్ పొందడానికి గుడ్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. మొత్తానికి గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

EGG Side Effects: గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మందికి అల్పాహారంగా కూడా గుడ్లను తీసుకుంటుంటారు. అదే సమయంలో, ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కూడా ప్రోటీన్ పొందడానికి గుడ్లను ఎక్కువగా తీసుకుంటుంటారు. మొత్తానికి గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కండరాల అభివృద్ధి నుంచి శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడేందుకు సహాయపడుతుంది. అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి. రోజూ గుడ్లు తినడం సురక్షితమేనా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇలాంటి ప్రశ్నలే మీకూ ఉంటే.. ఇదిగో ఈ సమాచారం మీకోసమే.

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారు వారంలో 7 నుంచి 10 గుడ్లు తీసుకోవచ్చు. అథ్లెట్లు లేదా వర్కౌట్స్ చేసే వారికి ప్రొటీన్లు ఎక్కువగా అవసరం. అలాంటి వారు నాలుగైదు గుడ్లు తినవచ్చు. రోజూ గుడ్లు తినే వారు గుడ్డులోని తెల్ల భాగాన్ని మాత్రమే తినాలి. అంతే కాకుండా గుండె జబ్బులతో బాధపడేవారు రోజుకు రెండు గుడ్ల కంటే ఎక్కువ తినకూడదు. గుడ్డు మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లు తీసుకోవడం తగ్గించాలి లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తినాలి.

గుడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు..

చర్మం, జుట్టు, గోర్ల ఆరోగ్యంలో గుడ్లు కీలకంగా సహాయం చేస్తాయి.

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

కంటి చూపును పెంచుతుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

ఎముకలను బలపరుస్తుంది.

కండరాల కణజాలాన్ని రిపేర్ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

అధిక రక్తపోటు ఉన్నవారు గుడ్లు తినకూడదు. ఒకవేళ తప్పక తీసుకోవాల్సి వస్తే.. పసుపు భాగాన్ని తీసి తినాలి. దాని నుంచి హాని తక్కువగా ఉంటుంది. పసుపు భాగంలో కొవ్వు ఉంటుంది. ఇది హై బీపీ ఉన్నవారికి హాని చేస్తుంది. మధుమేహం ఉన్నవారు డాక్టర్‌ని అడిగిన తర్వాతే ఆహారంలో గుడ్లు చేర్చుకోవాలి. గుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని పెంచుతుంది. దీని కారణంగా మీ పొట్టలో సమస్యలు విపరీతంగా పెరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories