Food Digestion Time: జీర్ణం కావడానికి ఏ ఆహారం ఎంత సమయం తీసుకుంటుందో తెలుసా..?

How Long Does Any Food Take to be Digested | Food Digestion Time | Telugu Online News
x

Food Digested: జీర్ణం కావడానికి ఏ ఆహారం ఎంత సమయం తీసుకుంటుందో తెలుసా..?

Highlights

Food Digestion Time: జీర్ణశక్తి బలంగా ఉన్నప్పుడే మానవుడు ఏ ఆహారమైనా తిని అరిగించుకోగలడు...

Food Digestion Time: జీర్ణశక్తి బలంగా ఉన్నప్పుడే మానవుడు ఏ ఆహారమైనా తిని అరిగించుకోగలడు. కానీ ప్రస్తుత రోజుల్లో సమయ పాలన లేని ఆహారపు అలవాట్ల వల్ల ఈ శక్తి రోజు రోజుకు క్షీణిస్తుంది. అందుకే చాలామంది జీర్ణ సమస్యలతో ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. అందుకే జీవనశైలి అనేది ఒక క్రమ పద్దతిలో ఉండాలి. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. అయితే మనం రోజు చాలా ఆహారాలు తింటాం అందులో కొన్ని తొందరగా జీర్ణమవుతాయి. మరికొన్ని ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఇందులో ఏ ఆహారం ఎంత సమయంలో జీర్ణమవుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.

1. కూరగాయలు

దోసకాయ, టొమాటో, ముల్లంగి మొదలైన వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కూరగాయలు జీర్ణం కావడానికి తక్కువ సమయం తీసుకుంటాయి. దాదాపు 30-40 నిమిషాలలో జీర్ణమవుతాయి. అలాగే బ్రోకలీ, క్యాబేజీ, మొదలైన ఆకు కూరలు జీర్ణం కావడానికి 40 నుంచి 50 నిమిషాలు పడుతుంది.

ఇది కాకుండా, యామ్, బత్తాయి, క్యారెట్ మొదలైన రూట్ వెజిటేబుల్స్ జీర్ణం కావడానికి 50 నుంచి 60 నిమిషాలు పడుతుంది.అలాగే మొక్కజొన్న, బంగాళదుంప మొదలైనవి జీర్ణం కావడానికి 60 నిమిషాలు పడుతుంది.

2. డ్రై ఫ్రూట్స్

పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ వంటి అధిక కొవ్వు విత్తనాలు కేవలం 60 నిమిషాల్లో జీర్ణం అవుతాయి. డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడినట్లయితే బాదం, జీడిపప్పు, వాల్‌నట్‌లు మొదలైన వాటిని జీర్ణం చేయడానికి చాలా సమయం పడుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ లో ఫ్యాట్, సోడియం ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి అంత తేలికగా జీర్ణం కావు. అలాగే మాంసం వంటి పదార్థాలు జీర్ణం కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇది సగటు సమయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్ షేక్స్ గురించి జీర్ణం చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది 20-30 నిమిషాల్లో జీర్ణం అవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories