Mobile Addiction In Child: ఈ వయసు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నారా.? జరగబోయేది ఇదే..!

Mobile Addiction In Child
x

Mobile Addiction In Child: ఈ వయసు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇస్తున్నారా.? జరగబోయేది ఇదే..!

Highlights

Mobile Addiction In Child: స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టంగా మారింది. ప్రతీ చిన్న పనికి ఫోన్‌ ఉండాల్సిందే.

Mobile Addiction In Child: స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టంగా మారింది. ప్రతీ చిన్న పనికి ఫోన్‌ ఉండాల్సిందే. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌తో కుస్తీలు పడుతున్నారు. అయితే స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.

పిల్లల్లో మొబైల్ వ్యసనం ఆందోళన కలిగించే అంశంగా మారుతోందని అంటున్నారు. . ఈ అలవాటు పిల్లల మానసిక ఎదుగుదల, సామాజిక ప్రవర్తన, మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. మొబైల్‌ ఫోన్‌ ఇవ్వకపోతే చిరాకు పడడం, కోపం తెచ్చుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా 1 నుండి 4 సంవత్సరాల వయస్సులో హానికరం. ఈ వయస్సులో పిల్లల మానసిక వికాసం చాలా వేగంగా జరుగుతుందని, ఈ కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడటం వల్ల వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

పిల్లలు మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారితే వారు క్రమంగా సమాజానికి దూరంగా ఉంటారు. అలాంటి పిల్లలు సామాజిక పరస్పర చర్యలకు దూరం పెరుగుతుంది. ఇతరులతో మాట్లాడటానికి వెనకాడతారు. మొబైల్ ఫోన్‌ వ్యసనం పిల్లల్లో ఓపికను తగ్గిస్తుందని అంటున్నారు. ఏదైనా పని పూర్తి చేయడం కోసం వారు ఆతృతగా ఉంటారు. ఇది పిల్లల ఏకాగ్రత, కమ్యూనికేషన్ సామర్థ్యాలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఎలా రక్షించాలి.?

మొబైల్ వ్యసనం నుంచి పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు చురుకైన పాత్ర పోషించాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు చిన్నారులను ఫోన్‌లకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా వారు నిద్రించడానికి రెండు-మూడు గంటల ముందు ఫోన్‌లను దూరంగా ఉంచాలి. పుస్తకాలు చదవడం, బయట ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. ఇలాంటి చర్యలతో పిల్లను ఫోన్‌లకు దూరం చేయొచ్చు.

ఇక వైద్యుల అభిప్రాయం ప్రకారం 14 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వడకూదని నిపుణులు చెబుతున్నారు. అలాగే 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా వాట్సాప్ వాడకూడదు. గూగుల్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను 13 ఏళ్లలోపు ఉపయోగించడం మంచిది కాదు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం యూట్యూబ్‌ని ఉపయోగించకూడదని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories