Health Tips: నాలుక చూసి వ్యాధుల నిర్ధారణ.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?

How do Doctors Diagnose Diseases by Looking at the Tongue
x

Health Tips: నాలుక చూసి వ్యాధుల నిర్ధారణ.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?

Highlights

Health Tips: మనం ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడి వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు ముందుగా అతడు నాలుక చూపించమని అడుగుతాడు.

Health Tips: మనం ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడి వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు ముందుగా అతడు నాలుక చూపించమని అడుగుతాడు. అయితే వైద్యులు ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి నాలుక వ్యాధుల గురించి చెబుతుంది. శరీరంలో ఏదైనా వ్యాధి దాడి జరిగినప్పుడల్లా నాలుక రంగు లేత గులాబీ నుంచి వేరే రంగులోకి మారుతుంది. ఒక్కో రంగుకి ఒక్కో వ్యాధి గురించి చెబుతుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

నాలుక రంగు నీలం లేదా ఊదాగా మారినప్పుడు అది గుండెకు సంబంధించిన వ్యాధులను సూచిస్తుంది. ఈ స్థితిలో గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. రక్తంలో ఆక్సిజన్ కొరత ఉంటుంది. టీ లేదా కాఫీ ఎక్కువగా తాగే వారి నాలుక గోధుమ రంగులో ఉంటుంది. ఇది కాకుండా సిగరెట్‌, బీడీకి అలవాటు పడిన వ్యక్తుల నాలుక కూడా గోధుమ రంగులో ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

మీ నాలుక పింక్ నుంచి ఎరుపు రంగులోకి మారితే శరీరంలో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ లోపం ఎక్కువగా ఉందని అర్థం. అందుకే నాలుకపై ఎర్రటి మచ్చలు కనిపించడం ప్రారంభిస్తాయి. నాలుక తెల్లగా ఉంటే మీరు నోటిని సరిగ్గా శుభ్రం చేయడం లేదని అర్థం. దీని కారణంగా తెల్లటి ధూళి పొర నాలుకపై ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఫ్లూ లేదా ల్యూకోప్లాకియా కారణంగా కూడా నాలుక తెల్లగా మారుతుంది.

నాలుక పసుపు రంగులోకి మారినట్లయితే శరీరంలో పోషకాల కొరత ఉందని అర్థం. ఇది కాకుండా కాలేయం లేదా కడుపులో సమస్యల కారణంగా నాలుకపై పసుపు పొర ఏర్పడుతుంది. నాలుక నల్లగా మారితే తీవ్రమైన వ్యాధులను సూచిస్తుంది. ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు. తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అల్సర్ల కారణంగా నాలుక నల్లగా మారుతుంది. ఎక్కువగా ధూమపానం చేసేవారు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories