Lifestyle: చలికాలంలో మోకాళ్ల సమస్యలు వేధిస్తున్నాయా? ఇదిగో సింపుల్‌ టిప్స్‌

Lifestyle: చలికాలంలో మోకాళ్ల సమస్యలు వేధిస్తున్నాయా? ఇదిగో సింపుల్‌ టిప్స్‌
x

Joint pains in winter: చలికాలంలో మోకాళ్ల సమస్యలు వేధిస్తున్నాయా? ఇదిగో సింపుల్‌ టిప్స్‌

Highlights

How to control joint pains in winter: చలికాలంలో మోకాళ్లు, కీళ్ల నొప్పులు సర్వసాధారణమైన విషయం. చలి కారణంగా కండరాలు, కీళ్లలో దృఢత్వం తగ్గుతుంది, అలాగే...

How to control joint pains in winter: చలికాలంలో మోకాళ్లు, కీళ్ల నొప్పులు సర్వసాధారణమైన విషయం. చలి కారణంగా కండరాలు, కీళ్లలో దృఢత్వం తగ్గుతుంది, అలాగే వాపు పెరుగుతుంది. ఇది నొప్పికి దారి తీస్తుంది. వాతావరణంలో ఉష్ణోగత్ర తగ్గడం వల్ల శరీరంలోని సిరలు కుచించుకుపోతాయి. ఈ కారణంగా రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది శరీరంలోని బాగాలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోవడానికి కారణమవుతుంది.

ఈ కారణంగా కీళ్లలో, కండరాల్లో నొప్పికి దారి తీస్తాయి. అంతేకాకుండా చలి కారణంగా చాలా మంది వ్యాయామానికి దూరమవుతారు. అందువల్ల కీళ్లలో దృఢత్వం తగ్గుతుంది. ఇది కాలక్రమేణ కీళ్లలో నొప్పికి దారి తీస్తుంది. అలాగే చలికాలం ఎండ లేకపోవడం కారణంగా శరీరానికి సరిపడ విటమిన్‌ డి లభించదు. ఇది కూడా కీళ్లు, కండరాల నొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సింపుల్‌ టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* చలికాలంలో శరీరం వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కీళ్ల ప్రాంతాలను వెచ్చగా ఉంచేందుకు లెగ్ వామర్లు లేదా ఉన్ని బట్టలు ధరించాలి. ఇందుకోసం హీటింగ్ ప్యాడ్, హాట్ వాటర్ ఫోమెంటేషన్‌తో పాటు వేడి నూనెతో మసాజ్ చేయడం కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయడుతుంది.

* ఎంత చలి ఉన్నా వ్యాయాం మాత్రం మరవకూడదు. ఇంట్లో అయినా సరే చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. లైట్ యోగా, స్ట్రెచింగ్, చిన్న నడక కీళ్ల దృఢత్వాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది.

* తీసుకునే ఆహారంలో చేపలు, వాల్‌నట్స్, పసుపు, అల్లం, మెంతులు, వెల్లుల్లి వంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్లలో వాపు, నొప్పిని తగ్గించడంలో ఉయోగపడుతుంది.

* విటమిన్‌ డీ లోపం నుంచి బయటపడేందుకు సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. గ్లూకోసమైన్, కొండ్రోయిటిన్ సప్లిమెంట్లను తీసుకోవాలి.

* చలికాలంలో నీటిని తక్కువగా తీసుకుంటారు. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యం. తగినంత నీరు తాగటం వల్ల కండరాల సమస్య తగ్గుతుంది.

నోట్‌: పైన తెలిపిన వివరాలు కేవలం ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories