Hair Fall Tips: ఈ ఆయిల్‌తో మసాజ్‌ చేయండి.. వెంటనే జుట్టు రాలడం ఆగుతుంది..!

Hibiscus Oil and Almond Oil Combination Stops Hair Fall
x

Hair Fall Tips: ఈ ఆయిల్‌తో మసాజ్‌ చేయండి.. వెంటనే జుట్టు రాలడం ఆగుతుంది..!

Highlights

Hair Fall Tips: జుట్టు అనేది మీ అందాన్ని రెట్టింపుచేస్తుంది.

Hair Fall Tips: జుట్టు అనేది మీ అందాన్ని రెట్టింపుచేస్తుంది. కానీ నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు రాలడం సాధారణ సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో మీరు బట్టతల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. చాలామంది మార్కెట్‌లో లభించే కొన్నిరకాల ఆయిల్స్‌ని వాడుతారు. కానీ ఇందులో రసాయనాలు కలవడం వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. వీటివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.

సహజసిద్దమైన ఆయిల్స్‌ని వాడటం వల్ల జుట్టురాలకుండా నిరోధించవచ్చు. మందారలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. మందార నూనె, బాదం నూనె కలయిక జుట్టు రాలడాన్ని ఆపుతుంది. ఈ ఆయిల్స్‌ని హెయిర్ కేర్ లో చేర్చుకుంటే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు జుట్టుని అందంగా, ఒత్తుగా, దృఢంగా తయారుచేయవచ్చు.

మొదట బాదం నూనె తీసుకొని కొద్దిగా వేడిచేసి అందులో రెండు స్పూన్ల మందార నూనె వేసి కలపాలి. దీంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ ఆయిల్ తయారైంది. రెండు చేతులతో దీనిని తలకు బాగా అప్లై చేయాలి. జుట్టును కనీసం 5-10 నిమిషాలు మసాజ్ చేయాలి. తరువాత ఒక గంట పాటు జుట్టుని వదిలేయాలి. తర్వాత తేలికపాటి షాంపూ సహాయంతో జుట్టును కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories