Winters Health Tips: చలికాలంలో గుండెకు రిస్క్‌ ఎక్కువ.. కానీ ఇవి పాటిస్తే ప్రమాదం ఉండదు..!

Heart Risk Is High In Winters If You Follow These Tips There Will Be No Risk
x

Winters Health Tips: చలికాలంలో గుండెకు రిస్క్‌ ఎక్కువ.. కానీ ఇవి పాటిస్తే ప్రమాదం ఉండదు..!

Highlights

Winters Health Tips: చలికాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సీజన్‌ల్‌ వ్యాధులతో పాటు బాడీలో అంతర్గతంగా ఉండే నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, వాపులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి.

Winters Health Tips: చలికాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సీజన్‌ల్‌ వ్యాధులతో పాటు బాడీలో అంతర్గతంగా ఉండే నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, వాపులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అంతేకాదు గుండె సమస్యలు ఉన్నవారికి చలికాలంలో హార్ట్‌ ఎటాక్‌ రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో గుండెపోటు కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ కొన్ని జీవనశైలి చిట్కాలను అనుసరించడం వల్ల ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

చలిలో గుండెపోటు రావడానికి కారణాలు

చల్లటి వాతావరణంలో సిరలు కుచించుకుపోతాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. గుండె కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. చలిలో శరీరంలో గడ్డకట్టే ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీనివల్ల గుండెకు రక్తం అందక గుండెపోటు సంభవిస్తుంది.

తక్కువ శారీరక శ్రమ,

చలి కారణంగా ప్రజలు ఇంట్లో నుంచి ఎక్కువగా బయటికి రావడానికి ఇష్టపడరు. ఇంటి లోపల ఉండడానికే ఇష్టపడతారు. దీని కారణంగా శారీరక శ్రమ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి.

వాయు కాలుష్యం

చలికాలంలో గాలిలో కాలుష్యం స్థాయి విపరీతంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాలుష్యం కారణంగా వాపు, కఫం, రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు

శీతాకాలంలో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్లు శరీరంలో వాపును పెంచుతాయి. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.

ఆహారపు అలవాట్లు

శీతాకాలంలో ప్రజలు వేయించిన ఆహారాలు, స్వీట్లను తింటారు. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీనివల్ల గుండెకి రక్త సరఫరా సరిగ్గా జరగక గుండెపోటు సంభవిస్తుంది.

నివారణ చర్యలు

చలికాలంలో తేలికపాటి వ్యాయామం చేయాలి. వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, ఇంట్లో యోగా చేయడం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొవ్వు, తీపి పదార్థాలను తినడం తగ్గించాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోవాలి. చలి నుంచి రక్షించుకోవడానికి వెచ్చని దుస్తులు ధరించాలి. శరీర ఉష్ణోగ్రతను మెయింటెన్‌ చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories