Urination: రాత్రిపూట పదే పదే టాయిలెట్‌కి వెళుతున్నారా.. ఇది అదే కావొచ్చు..!

Health News Frequent Urination at Night Reason Causes Symptoms
x

Urination: రాత్రిపూట పదే పదే టాయిలెట్‌కి వెళుతున్నారా.. ఇది అదే కావొచ్చు..!

Highlights

Urination: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ చాలా మంది తరచుగా మూత్ర విసర్జన వల్ల డిస్ట్రబ్‌ అవుతుంటారు.

Urination: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ చాలా మంది తరచుగా మూత్ర విసర్జన వల్ల డిస్ట్రబ్‌ అవుతుంటారు. ఇది మీకు కూడా జరుగుతుంటే అస్సలు విస్మరించవద్దు ఎందుకంటే ఇది ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావచ్చు. వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. అయితే రాత్రిపూట ఒకటి రెండు సార్లు మూత్ర విసర్జన చేయడం సహజమే. కానీ ఇంతకంటే ఎక్కువసార్లు టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తే ఆరోగ్యం బాగోలేదని వైద్య పరి భాషలో నోక్టురియా అంటారని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు అలవాట్ల వల్ల రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకి వెళ్లాల్సి వస్తుంది. ధూమపానం, మద్యం సేవించడం, టీ-కాఫీ ఎక్కువగా తాగడం, టెన్షన్, ఆందోళనకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. వృద్ధాప్యం, హార్మోన్ల మార్పుల వల్ల కూడా నోక్టురియా సంభవిస్తుంది. ఈ వ్యాధి క్యాన్సర్ అంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు చాలా ప్రమాదంగా మారుతుంది. ఈ వ్యాధిలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) అనే ఫిర్యాదు కూడా ఉంటుంది. ఇది తరచుగా మూత్రవిసర్జనకు కారణం కావడమే కాకుండా కడుపు నొప్పిని కలిగిస్తుంది.

తరచుగా మూత్రవిసర్జన సమస్య ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సూచిస్తుంది. కాబట్టి సకాలంలో తనిఖీ చేయడం అవసరం. టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు తరచుగా రాత్రిపూట ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. మీరు బరువు తగ్గుతున్నట్లయితే తరచుగా దాహం వేస్తున్నట్లయితే లేదా మీ ప్రైవేట్ పార్ట్‌లో దురద పెరుగుతున్నట్లయితే అప్రమత్తంగా వ్యవహరించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories