Health Benefits: రొజూ కరివేపాకు తింటే పొందే అద్భుతమైన ప్రయోజనాలు..

Health Benefits: రొజూ కరివేపాకు తింటే పొందే అద్భుతమైన ప్రయోజనాలు..
x
Curry Leaves
Highlights

Health Benefits: కరివేపాకు చెట్టు సుగంధభరితమైన ఆకులు గల ఒక చిన్న చెట్టు. దీని ఆకులని కరివేపాకు అంటారు.

Health Benefits: కరివేపాకు చెట్టు సుగంధభరితమైన ఆకులు గల ఒక చిన్న చెట్టు. దీని ఆకులని కరివేపాకు అంటారు. కరివేపాకులని ఇంగ్లీషులో curry leaves అనిన్నీ sweet neem leaves అనిన్నీ అంటారు. దీని శాస్త్రీయ నామము స్వీడన్ దేశపు వృక్ష శాస్త్రవేత్త యోహాన్ ఏండ్రియాస్ మర్రే (Johann Andreas Murray, 1740-1791) పేరు మీదుగా "మర్రయా కీనిగీ" (Murraya Koenigii) అయింది. ఇది ఎక్కువగా ఇండియా, శ్రీలంకలలో కనిపిస్తుంది. కూర, చారు, పులుసు, వగైరా వంటకాలలో సువాసనకోసం వాడుతారు

ఇది 4 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కాండం 40 సెంటీమీటర్లు వరకూ పెరుగుతుంది. భారతదేశంలో అన్ని ప్రాంతాలలోనూ కరివేప చెట్లు కనిపిస్తాయి. ఆకు నిర్మాణంలో చింతాకుని పోలి ఉంటుంది. ఈనె పొడవునా, ఈనెకి ఇరువైపులా, చిన్న చిన్న ఆకులు బారులు తీర, ఎదురెదురుగా కాకుండా, ఉంటాయి. ఈనె చివర ఒక ఆకు ఉంటుంది. ఈ లక్షణాన్ని ఇంగ్లీషులో imparipinnateఅంటారు. ఆకులు అండాకారం (oval shape) లో ఉంటాయి. కొమ్మల చివర సువాసనగల పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. గుండ్రని ఆకారంలో ఉన్న కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగాను,పండితే ముదురు రక్తం రంగులోకి మారతాయి. ఒకొక్క కాయలో రెండేసి విత్తనాలు ఉంటాయి. ఈ గింజలు (seeds) లో విష పదార్ధము ఉంటుంది.

డయాబెటీస్ ను కంట్రోల్ చేస్తుంది:

ప్రస్తుత కాలంలో వయసు సమస్య కాదు, దియబెటీస్ ఇక ఏజ్ సమస్యగా మారుతుంది. వయస్సు పైబడటం కంటే.. దియబెటీస్ కు భయపడే వారు ఎక్కువగా ఉన్నారు. అత్యంత ప్రమాదకరమైన ధీర్గకాలిక సమస్య. కరివేపాకులో యంటి హైపర్ గ్లిసమిక్ నతురల్ కలిగి ఉండటం వల్ల, ప్రదానమైన రక్త నాళాలలో గ్లూకోస్ కంట్రోల్ చేస్తుంది.

శ్వాసకోశ వ్యాధులు:

కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటి పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది. మూత్ర పిండాల సమస్యలు: కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా పూటకు టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల సమస్యల్లో హితకరంగా ఉంటుంది.

అధిక కొలెస్టరాల్ తగ్గిస్తుంది:

కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రరాల్ తగ్గటంతోపాటు హానికరమైన ఎల్.డి.ఎల్. కూడా గణనీయంగా తగ్గుతుంది. గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులు: కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. లేదా తాజా కరివేపాకు రసం ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే వేవిళ్లలో ఉపశమనం కలుగుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories