Health Benefits With Turmeric: పసుపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits With Turmeric: పసుపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
x

Turmeric Powder 

Highlights

Health Benefits With Turmeric | పసుపు (లాటిన్ Curcuma longa) అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప.

Health Benefits With Turmeric | పసుపు (లాటిన్ Curcuma longa) అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు.

బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించారని తెలుస్తోంది. భారతదేశంలోని హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. మనదేశంలో పసుపు లేని, వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పసుపులోని గుణాలు...

పసుపు దుంప రూపంలో మెట్ట ప్రాంతాలలో విరివిగా పండుతుంది. దుంపలపై ఉండే చెక్కుతీసి, ఎండ బెట్టి గృహస్థాయిలో తయారుచేసే పసుపును ముఖ్యంగా పూజలకు, ఇంటిలో వంటలకు వాడుతుంటారు. వాణిజ్య పరంగా పసుపుకు చాలా ప్రాముఖ్యం ఉంది. పసుపు దుంపలనుంచి వివిధ ప్రక్రియల ద్వారా పసుపు కొమ్ములు, పసుపు (పొడి) తయారుచేస్తారు. పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది.

* మొటిమలు : జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి,

* కఫము : వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి . కఫము తగ్గుతుంది .

* రక్త శుద్ధి : ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది .

* దగ్గు, జలుబు : మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి,

* నొప్పులు, బెనుకులు : పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టువేయాలి .

* కాలేయ ఆరోగ్యం :పసుపులో ఉండే ఆంటీ ఆక్సైడ్ లు, అంటి ఇంఫలమథోరి గుణాలు కాలేయ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది

* బరువు తగ్గుదల :పసుపులో ఉండే సర్క్యూమిం ఒబేసిటీ ఇంఫలమటిన్ ను తగ్గ్గిస్తుంది.

పసుపుతో కలిగే ఉపయోగాలు...

పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతిలో పోషిస్తుంది. సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం ఇనుమడిస్తుంది. వంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలావరకు సంబంధిత బాధలు తగ్గుతాయి.

చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories