Neem Leaves: చేదుగా ఉంటాయనుకోకండి.. నమిలితే కళ్లు చెదిరే లాభాలుంటాయి..

Neem Leaves Health Benefits
x

Neem Leaves Health Benefits

Highlights

Neem Leaves Health Benefits: వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని తెలిసిందే. వేప ఆకులు, బెరుడును ఎన్నో రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు.

Neem Leaves Health Benefits: వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని తెలిసిందే. వేప ఆకులు, బెరుడును ఎన్నో రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తుంటారు. జుట్టు మొదలు చర్మ సమస్యల వరకు వ్యాధులను తరిమికొట్టే గుణాలు ఎన్నో ఇందులో పుష్కలంగా ఉంటాయి. అయితే వేప ఆకులను నమలడం వల్ల కూడా లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? వేప ఆకులు నమలడమా.. వామ్మో అనుకుంటున్నారు కదూ!

అయితే చేదుగా ఉన్నా వేప ఆకును నమలడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ నాలుగు వేప ఆకులను నమలడం వల్ల శరీరంలో జరిగే మార్పులు మాములుగా ఉండవు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి వేపాకులు దివ్యౌషదంగా ఉపయోగపడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తరిమికొట్టడంలో కూడా వేపాకులు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో పేరుకుపోయే విష పదార్థాలను సమర్థవంతంగా తరిమికొడుతాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వేప ఆకులు బాగా ఉపయోగపడతాయి. ఎసిడిటీ సమస్యను దూరం చేయడంలో వేప బాగా సహాయపడుతుంది. ప్రతీరోజూ ఉదయం నాలుగు వేప ఆకులు నమలడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దూరం చేయడంతో పాటు.. కడుపులో పుండు, మంట, గ్యాస్ మొదలైన సమస్యల నుంచి ఉపశమం పొందొచ్చు.

క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడంలో కూడా వేప ఆకులు ఉపయోగపడతాయి. నిత్యం వేపాకులను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ కణాలు పెరగకుండా అడ్డుకోవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలం తరచూ వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చు. శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో కూడా వేప ఆకు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ఇంటర్నెట్‌ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories