Health Benefits with Garlic: వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits with Garlic: వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు...
x
Highlights

Health Benefits with Garlic | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు.

Health Benefits with Garlic | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్‌సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి పోట్లు పొడిచేది, వీర్యాన్ని వృద్ధి చేసేది, దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, అస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.

వెల్లుల్లి (Garlic) మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (Allium sativum). ఉల్లి వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి. ఇటీవల ఎల్లోపతీ వైద్యం కూడా వెల్లుల్లి విలువని గుర్తించింది.

వేల్లుల్లిలోని పోషక విలువలు...

ప్రతి 100 గ్రాములలో లభ్యమయే పోషక విలువలు ఈ దిగువ చూపిన విధంగా ఉంటాయని అంచనా

శక్తి :149 కేలరీలు

♦ కార్బోహైడ్రేట్‌లు : 33.6 గ్రాములు

♦ చక్కెర : 1.00 గ్రాము

♦ ఫైబర్ : 2.1 గ్రాములు

♦కొవ్వు పదార్ధాల : 0.5 గ్రాములు

♦ ప్రొటీనులు : 6.39 గ్రాములు,

♦ విటమిన్‌ బి : నిత్యావసరంలో 15%,

♦ విటమిన్‌ బి2 : నిత్యావసరంలో 7%,

♦ విటమిన్‌ బి3 : నిత్యావసరంలో 5%,

♦ విటమిన్‌ బి5 : నిత్యావసరంలో12%,

♦ విటమిన్‌ బి6 : నిత్యావసరంలో 95%,

♦ విటమిన్ : నిత్యావసరంలో 1%,

♦ విటమిన్‌ సి : నిత్యావసరంలో 52%,

♦ కాల్షియం : నిత్యావసరంలో 18%,

♦ ఐరన్‌ : నిత్యావసరంలో 14%,

♦ మెగ్నీసియం : నిత్యావసరంలో 7%,

♦ ఫాస్పరస్‌ : నిత్యావసరంలో 22%,

♦ పొటాషియం : నిత్యావసరంలో 9%,

♦ సోడియం : నిత్యావసరంలో 1%,

♦ జింకు : నిత్యావసరంలో 12%,

♦ మేంగనీస్ ‌: 1.672 మిల్లీగ్రాములు

♦ సెలినియం : 14.2 మిల్లీగ్రాములు

వేల్లులితో తెసుకోవాల్సిన జాగ్రత్తలు :

వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి. ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి గాటుగా ఉంటుంది.. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది. వెల్లుల్లి కొంతమందికి పడదు.. ఎలర్జీ వస్తుంది, దురదలు, తలనొప్పి, ఆయాసం వస్తాయి. వీళ్ళు వెల్లుల్లి తినరాదు. ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories