Health Benefits with Cloves: లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits with Cloves: లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు..
x
Highlights

Health Benefits with Cloves: లవంగము (దేవకుసుమ, Clove ) సుగంధ ద్రవ్యము, మసాలా దినుసు.

Health Benefits with Cloves: లవంగము (దేవకుసుమ, Clove ) సుగంధ ద్రవ్యము, మసాలా దినుసు. లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాడు .. విలువైన పోషకాలు ఉన్నాయి. దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీలో శొంఠికి బదులు లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని వేయించి పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణము అవుతుంది.

మూడు లీటర్ల నీళ్ళలో నాలుగు గ్రాముల లవంగాలు వేసి నీళ్లు సాగమయ్యేవరకూ మరిగించి తాగితే కలరా విరేచనాలుతట్టుతాయి . ఆరు లవంగాలు కప్పు నీళ్లు కలిపి డికాక్షన్ తయారుచేసి ..చెంచాకు కొంచం తేనే కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే " ఉబ్బసము " తగ్గుతుంది . పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది, వంటకాలలో దీనిని ఉపయోగించడం వల్ల చర్మ కాన్సర్ ను తగ్గించవచ్చును, దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరములో రోగనిరోధక శక్తిని పెంచుతుంది .

ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు.

లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు..

* పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.

* లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.

* లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.

* పెద్దపేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మజీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్‌' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందు.

* రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట.

* రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.

* జలుబుతో బాధపడేవాళ్లు కర్చీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే ఫలితం ఉంటుంది.

* ఏడుమొగ్గల్ని కొద్దినీళ్లలో మరిగించాలి. తరువాత దాన్నించి వచ్చే ఆవిరిని పీల్చి చల్లారిన తరువాత ఆ నీళ్లను తాగేస్తే జలుబుతో మండిపోతున్న ముక్కుకి కాస్తంత హాయి.

* లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హానికలిగించే ఫ్రీరాడికల్స్‌ను అడ్డుకోవడంతోబాటు క్యాన్సర్లు, హృద్రోగాలు, డయాబెటిస్‌, ఆర్త్థ్రెటిస్‌, అల్జీమర్స్‌ను నిరోధిస్తాయట. మొత్తమ్మీద ఆహారంలో భాగంగా లవంగాలను తీసుకోవడంవల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల శాతం పెరిగి హానికరమైన ఆక్సీకరణ ప్రక్రియతగ్గి రోగాలు రాకుండా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories