Health Benefits of Papaya: తరచుగా బొప్పాయి తినటం వల్ల కలిగే ఉపయోగాలు..

Health Benefits of Papaya: తరచుగా బొప్పాయి తినటం వల్ల కలిగే ఉపయోగాలు..
x
Papaya
Highlights

Health Benefits of Papaya: మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది.

Health Benefits of Papaya: మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు..

బొప్పాయి వల్ల ఉపయోగములు..

బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

బొప్పాయి లోని పోషక విలువలు..

* కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు.వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం.

* మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి.

* కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.

* బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.

* విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.

* బొప్పాయి 'కాయ' జీర్ణానికి తోడ్పడితే, 'పండు' పోషకాలనిస్తుంది.

* బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.

100 గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించే పోషకాలు..

* 40 క్యాలరీలు

* 1.8గ్రా. పీచు

* 9.8గ్రా కార్బోహైడ్రేట్లు

* 0.6గ్రా ప్రోటీన్లు

* 10మి.గ్రా. మెగ్నీషియం

* 257మి.గ్రా. పొటాషియం

* 3 మి.గ్రా. సోడియం

* 24మి.గ్రా. కాల్షియం

* 61.8 మి.గ్రా. విటమిన్‌-సి

* విటమిన్‌ ఎ (6%)

* బీటా కెరోటిన్‌ (3%)

* విటమిన్‌ బి1 (3%)

* బి2 (3%)

* బి3 (2%)

* బి6 (8%)

Show Full Article
Print Article
Next Story
More Stories