Health Benefits with Apple: తరచుగా ఆపిల్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు...

Health Benefits with Apple: తరచుగా ఆపిల్ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు...
x
Apple
Highlights

Health Benefits with Apple: ఆపిల్ (ఆంగ్లం Apple) రోసేసి (Rosaceae) కుటుంబానికి చెందిన పండు.

Health Benefits with Apple: ఆపిల్ (ఆంగ్లం Apple) రోసేసి (Rosaceae) కుటుంబానికి చెందిన పండు. దీనిని తెలుగులో Seema Regi Pandu (సీమ రేగి పండు) అని కూడా పిలుస్తారు. ఇది పోమ్ (pome) రకానికి చెందినది. ఆపిల్ (Malus domestica) జాతి చెట్ల నుండి లభిస్తుంది. ఇది విస్తృతంగా సేద్యం చేయబడుతున్న పండ్ల చెట్లలో ఒకటి. ఇది మానవులు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. ఆపిల్ చెట్లు చిన్న ఆకురాల్చే చెట్లు వసంతకాలంలో పూసి చలికాలంలో పండ్లనిస్తాయి. ఇవి పశ్చిమ ఆసియాలో జన్మించాయి. ఆసియా, యూరప్ దేశాలలో కొన్ని వేల సంవత్సరాలుగా పెంచబడుతున్నది.

ఆపిల్ పండ్లలో 7,500 పైగా రకాలు వివిధ లక్షణాలు కలవిగా గుర్తించారు. కొన్ని తినడానికి రుచి కోసం అయితే మరికొన్ని వంట కోసం ఉపయోగిస్తారు. వీటిని సామాన్యంగా అంటు కట్టి వర్ధనం చేస్తారు. ఇవి చాలా రకాల శిలీంద్రాలు, బాక్టీరియా చీడలను లోనై ఉంటాయి.

యాపిల్.. అనేక పోషకాలు ఈ పండులో ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు . అందుకనేరోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా న్యుమోనియా వ్యాధి రాకుండా యాపిల్ చేయగలదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

యాపిల్ పండ్లలో ఉండే విటమిన్ సి న్యుమోనియా రాకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం యాపిల్ పండ్లను తినడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు అంటున్నరు ఆరోగ్య నిపుణులు. అలాగే రోజుకు ఒక గ్రీన్ యాపిల్ తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. గ్రీన్ యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. కాలేయాన్ని రక్షిస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలోని థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా ఈ యాపిల్ పండు చేస్తుంది. చేతులు వణకడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలను.. గ్రీన్ యాపిల్ తో చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

100 గ్రాముల ఆపిల్‌లో ఉండే పోషక విలువలు:

* విటమిన్ ఏ : 900 I.U.

* విటమిన్ బి : 0.07 mg.

* విటమిన్ సి : 5 mg.

* కాల్షియం : 6 mg.

* ఐరమ్ : 3 mg.

* ఫాస్పరస్ : 10 mg.

* పొటాషియం : 130 mg.

* కార్బోహైడ్రేట్స్ : 14.9 gm.

* క్యాలరీలు : 58 Cal.

Show Full Article
Print Article
Next Story
More Stories