Health Tips: పండే కాదు..గింజలు కూడా అమృతమే..వీటిని నానబెట్టుకుని తింటే ఎన్ని ప్రయోజనాలో.!

Health Tips: పండే కాదు..గింజలు కూడా అమృతమే..వీటిని నానబెట్టుకుని తింటే ఎన్ని ప్రయోజనాలో.!
x
Highlights

Health Tips: బరువు తగ్గడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బొప్పాయి గింజలను రాత్రి నానబెట్టి..ఉదయాన్నే ఆ నీటిని తాగండి. బొప్పాయిలో ఉండే ఎ, బి, సి, ఇ, కే వంటి పలు మిటమిన్లతోపాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మినరల్స్ మీ ఆరోగ్యాన్ని అద్భుతంగా ఉంచుతాయి.

Health Tips: బొప్పాయిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. తియ్యగా ఉండే ఈ పండును తరచుగా తింటే ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. బొప్పాయిలో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ ఉన్నాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చాలా మంది బొప్పాయి తిని వాటిలోని గింజలను పడేస్తుంటారు. పండు పండులోనే కాదు గింజలోనూ అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఖాళీ కడుపుతో బొప్పాయి గింజల నీరు తాగడం:

ఈమధ్య కాలంలో చాలామందిని రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కోవిడ్ కాలం నుంచి ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపుతున్నారు. డెంగ్యూ వంటి వ్యాధులకు బొప్పాయి పండు దివ్యౌషధం. అయితే బొప్పాయి గింజలను నీటిలో నానబెట్టి..ఉదయం ఖాళీ కడుపుతో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం బొప్పాయి గింజలను నానబెట్టి..వాటిని నీటిని తాగితే మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

బొప్పాయి గింజలు నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తాగితే.. సహజమైన జీర్ణ నివారణగా పనిచేస్తుంది.ప్రేగు కదలికను మెరుగుపరచడంతోపాటు మలబద్ధకం సమస్యను కూడా నయం చేస్తుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎలాంటి ఆరోగ్య సమస్యకైనా బొప్పాయి గింజలు ఔషధంగా పనిచేస్తాయి.

అద్భుతమైన పానీయం:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి గింజలు నానబెట్టిన నీటిని తాగితే మన శరీరంలోని టాక్సిన్స్ అన్ని బయటకు పోతాయి. అంటే ఇది మన శరీరంలోని విషపూరిత అంశాలను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.సహజంగానే ఈ టాక్సిన్స్ మన కాలేయ ఆరోగ్యాన్ని, పనితీరును మెరుగుపరచడమే కాకుండా మన మొత్తం శరీర శుభ్రతకు కూడా సహాయపడతాయి. కాలేయ సమస్యలు ఉన్నవారు రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బొప్పాయి గింజలను ఒక గ్లాసు నీళ్లలో తాగడం మంచిది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

మీకు ఇమ్యూనిటీ తక్కువగా..పలు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే..బొప్పాయి గింజలను నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తాగండి. ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్న సహజ పానీయం. ముఖ్యంగా మన రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఇందులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులను కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి:

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల మన శరీర బరువు అదుపులో ఉంటుంది.ఎందుకంటే బొప్పాయి పండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అదనపు కేలరీలను నియంత్రించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నీటిని తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఈ పానీయం మన శరీరాన్ని టాక్సిన్స్ లేకుండా చేయడంలో కూడా పనిచేస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను రక్షించడంతోపాటు జీవక్రియ ప్రక్రియను ప్రేరేపిస్తుంది.

గుండె ఆరోగ్యానికి :

బొప్పాయి గింజల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది మన గుండె సమస్యలను దూరం చేస్తుంది.

ఈ నీటిని ఎలా తయారు చేసుకోవాలి:

-బాగా పండిన బొప్పాయి పండును తీసుకుని అందులోంచి గింజలను వేరు చేయండి.

-తర్వాత ఈ గింజలను బాగా కడగాలి.

-వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టండి.

-ఉదయం నిద్ర లేవగానే ఈ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి.

-ఈ నీటిని తాగే ముందు మీరు వైద్యుడి సలహా తీసుకోవడం మర్చిపోవద్దు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.


Show Full Article
Print Article
Next Story
More Stories