Ridge Gourd Benefits: బీరకాయను తినడం లేదా..? అయితే ఈ ప్రయోజనాలను మీరు మిస్ అయినట్టే..!

Ridge Gourd Benefits: బీరకాయను తినడం లేదా..? అయితే ఈ ప్రయోజనాలను మీరు మిస్ అయినట్టే..!
x
Highlights

Ridge Gourd Benefits: మార్కెట్‌లో మనకు రకరకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ మనం రుచిగా అనిపించే కూరగాయలను మాత్రమే ఏరికోరి తీసుకుంటాం.

Ridge Gourd Benefits: మార్కెట్‌లో మనకు రకరకాల కూరగాయలు అందుబాటులో ఉంటాయి. కానీ మనం రుచిగా అనిపించే కూరగాయలను మాత్రమే ఏరికోరి తీసుకుంటాం. ఇక బీరకాయ వంటి కూరగాయలను అస్సలు పట్టించుకోం. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. బీరకాయల్లో మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. డైటింగ్ చేసేవారికి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

బీరకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ జ్యూస్ తాగితే ఆకలి వేయదు. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఆహారం తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గడం సులభమవుతుంది. బీరకాయల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరికి సీజన్లతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ శరీరం వేడిగా ఉంటుంది. దాని వల్ల చర్మం పగులుతుంది. అలాంటి వారు ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఫలితంగా చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

బీరకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బీరకాయల్లో బయోటిన్, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను నియంత్రించవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

బీరకాయలో జింక్, విటమిన్లు ఎ, సి సమృద్దిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. బీరకాయల్లో పోటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హై బీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

వీటిల్లో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు, ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories