Health Benefits of Lemon: నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits of Lemon: నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు...
x
Highlights

Health Benefits of Lemon | నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి.

Health Benefits of Lemon | నిమ్మ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం గురించి ఎక్కువగా వీటిని పెంచుతారు.పులుసు నిమ్మ పొద లేక చిన్నపాటి చెట్టు. దీని కొమ్మలు తేలికగా వుంటాయి. కొమ్మలు దట్టంగా వుంటాయి. వీటి పై కొనదేలిన ముళ్లు వుంటాయి. లేత కొమ్మలు లేత ఆకుపచ్చ రంగులో అండాకారములో వుంటాయి. ఆకులు అంచులు వంకర టింకరగా వుంటాయి. వీటికి చిన్న చిన్న పూలు గుత్తులుగా ఏర్పడతాయి. ఇవి ద్విలింగ పూలు. పూత మొగ్గలు మొదట లేత ఊదా లేక గులాబిరంగులో వుండి క్రమేణ తెలుపు రంగుకి మారతాయి. వీటి రక్షక పత్రాలు ఆకులుకొనదేలి ఆకుపచ్చగా, ఆకర్షక పత్రాలు తెల్లగా, మందంగా ఉంటాయి. కేసరాలు చిన్నవిగా ఉంటాయి. అండాశం ఆకుపచ్చగా, ఉబ్బి వుంటుంది.

నిమ్మ రసం ఉపయోగాలు..

* నిమ్మరసం వేసవికాలంలో ఉప్పు లేదా పంచదారతో కలిపి పానీయంగా తాగడం చాలా మందికి ఇష్టం. ఒక నిమ్మపండు నుండి ఇంచుమించు 3 చెంచాల రసం వస్తుంది. నిమ్మరసంతో పులిహోర చాలా రుచిగా ఉంటుంది.

* నిమ్మరసంలో చేపలు, మాంసం కొంతసేపు నానబెట్టిన అది మెత్తబడి రుచిగా ఉంటుంది.

* నిమ్మపండులతో ఊరగాయ చేస్తారు. ఇది పత్యం చేసేవారికి చాలా ఇష్టంగా ఉంటుంది.

* ఎండా కాలంలో నిమ్మ రసం కలిపిన షోడ ఉపయోగం తెలియని వారుండరు. నీమ్మతో షర్బత్ లు, నిల్వ వుండే పానీయాలు తయారు చేస్తారు. ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాల త్వరగా శక్తి వస్తుంది. అందుకే నిరాహార దీక్ష విరమించె వారు నిమ్మ రసంతో దీక్ష విరమిస్తారు.

నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు...

* నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది.

* ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు. దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి.

* జపాన్ లోని కొందరు నిమ్మ వాసన ఎలుకలలో ఉద్రేకాన్ని తగ్గిస్తాయని నిరూపించారు.

* రెండు చెంచాల నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసులో కలుపుకొని రోజుకి నాలుగు లేక ఐదు సార్లు తాగడము వలన పచ్చకామెరల వ్యాధి తగ్గుతుంది.

* రోజూ పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకొని, కొంచెం ఉప్పు కలిపి తాగితే ఊబకాయం తగ్గుతుంది.

* లావుగా ఉండేవారు ఆహారాన్ని తగ్గించి, రోజుకు రెండు మూడుసార్లు నిమ్మరసం సేవిస్తే, బరువు తగ్గుతుంది.

* చుండ్రు, మొటిమలు, మొదలగు చర్మవ్యాధులకు నిమ్మరసాన్ని రెండు మూడుసార్లు రోజూ సేవించాలి. లాభం ఉంటుంది.

* మలబద్ధకము, అజీర్ణం, అగ్నిమాంద్యం మొదలగు జీర్ణక్రియ వ్యాధుల్లో ప్రతీరోజూ రెండు పూటలా నిమ్మరసం త్రాగితే జీర్ణరసాలు చక్కగా ఊరుతాయి. ఆకలి పెరిగి, బరువు హెచ్చుతుంది.

నిమ్మకాయలోని పోషక విలువలు...

శక్తి : 29 కాలరీలు,

పిండిపదార్థాలు : 9 గ్రాములు,

చక్కెరలు : 2.5 గ్రాములు,

పీచుపదార్థాలు :2.8 గ్రాములు,

కొవ్వు పదార్థాలు : 0.3 గ్రాములు,

మాంసకృత్తులు :1.1 గ్రాము,

నీరు : 89 గ్రాములు,

విటమిన్ సి : 53 మి.గ్రాములు.

Show Full Article
Print Article
Next Story
More Stories