Health Tips: ఈ ఒక్క పండు తినండి చాలు.. మార్పు మీ ఊహకు కూడా అందదు..!

Health Benefits With Kiwi Fruit in Telugu
x

Health Tips: ఈ ఒక్క పండు తినండి చాలు.. మార్పు మీ ఊహకు కూడా అందదు..!

Highlights

అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ ఏదో ఒక పండును తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఒక్క పండును మాత్రం కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Health Tips: ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్‌ ఆహారంతో పాటు కచ్చితంగా పండ్లను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ ఏదో ఒక పండును తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే ఒక్క పండును మాత్రం కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అదే కివి ఫ్రూట్‌.

కివి పండు అనగానే మనలో చాలా మంది ధర ఎక్కువనే భావనలో ఉంటారు. అయితే కివితో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ధర ఎక్కువైనే తినాల్సిందే. ఇంతకీ కివి పండును ప్రతీ రోజూ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కివి తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరడచంలో కివి కీలక పాత్ర పోషిస్తుంది. కీళ్ల నొప్పులతో పాటు ఇతర శరీర భాగాలలో నొప్పులను తగ్గించడంలో కివి కీలక పాత్ర పోషిస్తుంది. కళ్ల ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా కివి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్‌ సి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

కివిలో మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్లు, ఐరన్‌ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. నిత్యం అలసటతో బయపడే వారు కివిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో రక్తం పెరగాలంటే కూడా కివిని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కివి ఫైబర్‌ కంటెంట్‌కు పెట్టింది పేరు. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కివిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ వృద్ధిని నిరోధిస్తాయి.

రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పెరగడంలో కూడా కివీ కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్యకు కూడా కివి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే సెరోటోనిన్ మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఒత్తిడి దూరమవుతుంది. ఇక అధిక రక్తపోటు ఉన్నవారు కివీని క్రమం తప్పకుండా తీసుకోవాలి. కివిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌ వంటి సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories