Jujube: రేగుపండ్లు తింటున్నారా?... అయితే, ఈ అద్భుత ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Health Benefits Of Jujube Fruit
x

Jujube: రేగుపండ్లు తింటున్నారా?... అయితే, ఈ అద్భుత ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి..!

Highlights

Jujube: రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్.. పుల్లగా, తియ్యగా ఉంటాయి అందుకే వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు.

Jujube: రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్.. పుల్లగా, తియ్యగా ఉంటాయి అందుకే వీటిని ఎక్కువగా ఇష్టపడతారు.. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు. చలికాలంలో ఈ రేగు పండు ఎంతో మేలు చేస్తుందట. వాతావరణంలో మార్పు వల్ల కలిగే ఇంఫెక్షన్స్ ను ఇది అడ్డుకుంటుందట. విటమిన్ సీ ఇందులో ఉంటుంది. అంతే కాదు రేగు పండు చుండ్రును కూడా అరికడుతుందట. జలుబు, దగ్గు, జ్వరముతో అంటూ ఉండే వారికి రేగు పండు చాలా ఉపశమనాన్ని ఇస్తుందని అంటున్నారు నిపుణులు.

రేగు పండ్లు... పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ మనల్ని కాపాడతాయి రేగు పండ్లు. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం.

ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. మన ఎముకలు దృఢంగా, గట్టిగా ఉండేందుకు అవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినిపించడం సరైన పరిష్కారం. ఈ పండ్లు తింటే మంచిది వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు... కీళ్ల మంటల్ని చల్లబరుస్తాయి.

మన శరీరానికి ఏవి ఎంత కావాలో డిసైడ్ చెయ్యడంలో రేగు పండ్లు ఉపయోగపడతాయి. తేలిగ్గా జీర్ణమయ్యే ఈ పండ్లు... ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో... మన శరీరం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే... రేగు పండ్లు తినడం మంచిది.

కొంతమందికి ఎంత ట్రైచేసినా నిద్రపట్టదు. చివరకు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సరైన పండ్రు రేగు పండ్లు. నరాలను శాంతపరచడం ద్వారా ఇవి మనం నిద్రపోయేలా చేయగలవు. టెన్షన్, ఒత్తిడి వంటివి తగ్గాలంటే కూడా రేగుపండ్లు తినాలి.

ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి కూడా బాగా సహాయపడతాయి. రేగులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories