అవిసె గింజలతో మెరుగైన ఆరోగ్యం

అవిసె గింజలతో మెరుగైన ఆరోగ్యం
x
Highlights

అవిసె గింజలు ఇవి ఆరోగ్యానికి దివ్య ఔషదాలు. రోజూ వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అవిసె గింజలు ఇవి ఆరోగ్యానికి దివ్య ఔషదాలు. రోజూ వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి..అవిసె గింజలను చారెడు తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందంటున్నారు తాజా అధ్యయనాలు జరిపిన పరిశోధకులు.

శరీరానికి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అరుదుగా లభిస్తుంటాయి..కానీ ఈ అవిసె గింజల్లో ఇవి పుష్కలంగా లభిస్తాయి..ఇందులో పీచు పదార్ధాలు, యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. అలాగే జుట్టు సమస్యలతో బాధపడేవారు కూడా రోజూ అవిస గింజలను తీసుకోవడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు.

ఇక ఊబకాయం సమస్యతో సతమతమయ్యేవారు ఈ అవిసె గింజలను తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అధిక బరువును తగ్గించుకోవచ్చుఇక రోజూ వీటిని తినడం అలవాటు చేసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అవిసె గింజెల్లో రెండు రకాల పీచుపదార్ధాలు ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి అనేది వెయ్యదు. కాబట్టి ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగిన వారికి వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక మలబద్దకం ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు. మెదడు ఆరోగ్యినికి ఇవి తోడ్పడతాయి.. కడుపులో మంటను తగ్గిస్తాయి.

చర్మ వ్యాదులు రాకుండా జాగ్రత్త పరుస్తాయి. అలాగే కొత్త చర్మ కణాలు పుట్టుకొచ్చు ముఖంలో కొత్త ఉత్తేజం పుట్టుకొస్తుంది. మరీ ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు ఏర్పడినా, దురదలు, వాపులు, నొప్పులు రావడం, కందిపోవడం వల్ల సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది వాతావరణ కాలుష్యం కారణంగా రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా జుట్టు చిట్లిపోవడం, పొడిబాడరం , రాలిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జుట్టి చిట్లిపోయే సమస్యకు అవిసె గింజలు చెక్ పెడతాయి. జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతూ ఒత్తుగా బలంగా ఉంటుంది.

హై బ్లడ్‌ ప్రెజర్ తో బాధపడేవారు ప్రతి రోజు ఈ గింజలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని సూచిస్తున్నారు. డయాబెటిస్‌తో సతమతమయ్యేవారు వారు సైం వీటిని తీసుకోవచ్చు. చక్కటి ఫలితం లభిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories