Popcorn: పాప్‌కార్న్‌ తింటే ఇన్ని లాభాలా? అవేంటో తెలిస్తే..

Health Benefits of Eating Popcorn
x

Popcorn: పాప్‌కార్న్‌ తింటే ఇన్ని లాభాలా? అవేంటో తెలిస్తే..

Highlights

Popcorn Health Benefits: టైంపాస్ కి తినే పాప్‌కార్న్‌ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్నది చాలామందికి తెలియదు.

Popcorn Health Benefits: టైంపాస్ కి తినే పాప్‌కార్న్‌ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అన్నది చాలామందికి తెలియదు. పాప్ కార్న్ లో బి విటమిన్, మెగ్నీషియం, మాంగనీస్ పుష్కలంగా లభిస్తాయి. అంతే కాకుండా పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ రక్తంలో షుగర్ లెవల్స్ ను కూడా నియంత్రిస్తుందని నిపుణులు అంటున్నారు.

జొన్నల నుంచి తయారయ్యే ఈ పాప్‌కార్న్‌లో ఉండే పీచు, పాలిఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి కాంప్లెక్స్, మాంగనీస్, మెగ్నీషియం మొదలైనవన్నీ ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఎముకల బలానికి అవసరమైన లవణాలు మక్కజొన్నలో పుష్కలం. పసుపు రంగులోని ఈ గింజలలో మినరల్స్‌ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ వంటివి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటంలోనూ సాయపడతాయి.

పాప్‌కార్న్‌లో ఉండే ఫ్రీ రాడికల్స్ వయసు పెరిగే కొద్దీ తలెత్తే సమస్యలను దరిచేరకుండా చూస్తాయి. ముఖ్యంగా ముడతలు, దృష్టి లోపం, కండరాల బలహీనత, ఆస్టియోపొరోసిస్, అల్జిమర్స్, జుట్టు రాలిపోవడం మొదలైన సమస్యలకు ఇది చక్కని పరిష్కారంగా నిలుస్తుంది. 28 గ్రాముల పాప్‌కార్న్‌లో 0.9 మిల్లీ గ్రాముల ఐరన్‌ ఉంటుంది. దీన్ని రోజూ స్నాక్స్‌గా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమయ్యే ఐరన్‌ను సులభంగా పొందవచ్చు. వీటిలో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు కాబట్టి బరువు పెరుగుతామనే భయం ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories