Cloves Health Benefits: లవంగాలతో షుగర్ నార్మల్ అవుతుందట..క్లీనికల్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడి

Cloves Health Benefits: లవంగాలతో షుగర్ నార్మల్ అవుతుందట..క్లీనికల్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడి
x

Cloves Health Benefits: లవంగాలతో షుగర్ నార్మల్ అవుతుందట..క్లీనికల్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడి

Highlights

Cloves Health Benefits:డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు షుగర్ ను అదుపులోకి ఉంచుకునేందుకు ఎన్నో అవస్థలు పడుతుంటారు. షుగర్ లెవల్స్ తగ్గించుకునేందుకు మందుల నుంచి..ఆహార నియమాల వరకు ఎన్నో ప్రయత్నిస్తుంటారు. అయితే వీటితోపాటు లవంగాలు సరైన పద్ధతిలో తీసుకుంటే షుగర్ తప్పకుండా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగో తెలుసుకుందాం.

Cloves Health Benefits: డయాబెటిస్ అనేది ఒకసారి సోకితే..తగ్గదు. దాన్నికంట్రోల్లో ఉంచుకోవడమే అసలైన మెడిసిన్. కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కావు. అలాంటి వారు మీ రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లవంగాలు డయాబెటిస్ నివారణకు ఎలా సహాయపడతాయి. వాటిని ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లవంగాలు..మసాలాల్లో రారాజుగా పిలుస్తుంటారు. వీటిలో అనేక ఔషధ గుణాలున్నాయి. అంతేకాదు వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా లవంగాల్లో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం..రక్తంలో చక్కెర లెవల్స్ ను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి. దీంతోపాటు లవంగాలను ఆహారంలో భాగం చేసుకుంటే బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు.

లవంగాలను ఆహారంలో ఎలా తీసుకోవాలి?

రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు తీసుకోవాలి. అందులో 6 లేదా 8 లవంగాలు వేసి స్టౌ పై మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లను వడకట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత తాగాలి. ఇలా మూడు నెలల పాటు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లేదంటే ప్రతిరోజు రెండు నుంచి మూడు లవంగాలు నమిలినా సరే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఇవి తీసుకోవడంతోపాటు మీరు తీసుకునే ఆహారం కూడా కంట్రోల్లో ఉంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

ఈ విషయాన్ని 2018లో జర్నల్ ఆఫ్ డయాబెటిస్, లైఫ్ స్టైల్ అండ్ క్లీనికల్ రీసెర్చీలో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం..టైప్ 2 డయాబెటిస్ ఉన్నవ్యక్తులు 4 వారాలు పాటు రోజుకు 3 లవంగాలు తింటే వారి రక్తంలో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీకి చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఎ రాజ్ మోహన్ రావు పాల్గొన్నారు. లవంగాలలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర లెవల్స్ ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories