పాదాలు పగలకుండా ఉండాలంటే?

పాదాలు పగలకుండా ఉండాలంటే?
x
Highlights

వర్షకాలం వచ్చిందంటే చాలు ఎన్నో చర్మ సమస్యలను కలిగిస్తుంది.

వర్షకాలం వచ్చిందంటే చాలు ఎన్నో చర్మ సమస్యలను కలిగిస్తుంది. ఈ కాలంలో చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో పాదాలు పగలటం కూడా ఓ సమస్య. పాదాలు పగలటమనేది ఆడవారి సమస్య అని చాల మంది అనుకుంటారు? కానేకాదు. ఈ సమస్య అందరినీ పట్టి పీడిస్తుంది.

పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.

* పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.

* రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.

* పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.

* షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.

* చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట అస్సలు నడవకూడదు.

* పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.

* ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోవటం అంత మంచిది కాదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories