Health Benefits of Pomegranate: రోజూ దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

Health Benefits of Pomegranate: రోజూ దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
x
Promegranate
Highlights

Health Benefits of Pomegranate: ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది.

Health Benefits of Pomegranate: ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది. దీనిని "దామిడీ వృక్షమ్" ఆని కూడా అంటారు. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్రంలోని, మహారాష్ట్రలో షోలాపూర్, నాగ్పూర్ జిల్లాలలోని రాష్ట్రంలో కూడా దానిమ్మ సాగు జరుగుచున్నది. మనదేశం నుంచి సుమారు 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి. దీని శాస్త్రీయ నామము " Punica Granatum". ఈ ఫలము తినడానికి ఏంతో రుచిగా ఉంటుంది. వీటిలో విటమిన్లు ఎ, సి, ఇ, బి5, flavanoids ఉన్నాయి.

దానిమ్మలోని ఔషద గుణాలు..

* అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.

* దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.

* సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ దానిమ్మకు ఉంది.

* గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.

* వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.

* ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories