Yellow Teeth: దంతాలు పసుపు రంగులోకి మారాయా.. ఈ చిట్కాలతో తెల్లగా మార్చండి..!

Have Yellow Teeth Whiten Them With These Tips
x

Yellow Teeth: దంతాలు పసుపు రంగులోకి మారాయా.. ఈ చిట్కాలతో తెల్లగా మార్చండి..!

Highlights

Yellow Teeth: నేటికాలంలో చాలామంది దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయి.

Yellow Teeth: నేటికాలంలో చాలామంది దంతాలు పసుపు రంగులోకి మారుతున్నాయి. దీంతో వారు పదిమందిలో నోరు తెరవడానికి ఇబ్బందిపడుతుంటారు. దంతాలు పసుపురంగులోకి మారడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొంతమంది గుట్కాలు తినడం, సిగరెట్‌ తాగడం, కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకోవడం, సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో కొన్ని చిట్కాలని పాటించి పళ్లని తెల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

1. రోజూ బ్రష్ చేయండి

కొంతమందికి బ్రష్ చేయకుండానే టీ బిస్కెట్లు తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల దంతక్షయం ఏర్పడుతుంది. మీరు నిద్రలేచిన వెంటనే బ్రష్ చేసుకోవాలి. దీంతో దంతాలు పసుపు రంగులోకి మారకుండా శుభ్రంగా ఉంటాయి.

2. లవంగం పొడి

లవంగం పొడితో పసుపు పళ్ళు తెల్లగా మారుతాయి. దీని కోసం ఆలివ్ నూనెలో లవంగాల పొడిని మిక్స్ చేసి పసుపు పళ్ళపై అప్లై చేయాలి. ఇది నోటి దుర్వాసనను, బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. పళ్లని తెల్లగా మారుస్తుంది.

3. నిమ్మరసం, ఉప్పు

నిమ్మరసంలో ఆవాలనూనె, ఉప్పు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పళ్లపై అప్లై చేయడం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. అంతేకాదు వీటిపై పేరుకుపోయిన బ్యాక్టీరియా నాశనమవుతుంది. నోటినుంచి దుర్వాసన కూడా పోతుంది.

4. ఆపిల్‌ సైడర్‌ వెనిగర్

పసుపు పళ్లను తెల్లగా మార్చడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. దీంతో నెమ్మదిగా బ్రష్ చేసి పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాలు పసుపు త్వరగా తొలగిపోయి తెల్లగా మారుతాయి.

5. రెండు పూటల బ్రష్‌

ప్రతి ఒక్కరు ఉదయం, రాత్రిపూట డిన్నర్‌ అయిపోయిన తర్వాత పడుకునే ముందు బ్రష్‌ చేసుకొని పడుకోవాలి. దీనివల్ల మన నోటిలో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది. పళ్లు పసుపురంగులోకి మారకుండా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories