Weight Loss Tips: డెలివరీ తర్వాత బరువు పెరిగారా.. ఇలా తగ్గించుకోండి..?

Have Women Gained Weight After Delivery Loss Weight Through These Tips
x

Weight Loss Tips: డెలివరీ తర్వాత బరువు పెరిగారా.. ఇలా తగ్గించుకోండి..?

Highlights

Weight Loss Tips: చాలామంది మహిళలు డెలివరీ తర్వాత విపరీతంగా బరువు పెరుగుతారు.

Weight Loss Tips: చాలామంది మహిళలు డెలివరీ తర్వాత విపరీతంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే తొమ్మిది నెలలు బిడ్డని మోసిన తర్వాత వారి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఆహార విషయంలో కూడా మార్పులు రావడంతో ఊబకాయం, బరువు పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. మళ్లీ సాధారణ స్థితిలోకి రాలేకపోతున్నామని చాలామంది మదనపడుతారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీ బరువును నియంత్రించుకోవచ్చు. దీని కోసం మీరు కొంత కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని పద్దతుల గురించి తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో ఎలాంటి వ్యాయామం ఉండదు కాబట్టి డెలివరీ తర్వాత నడక ప్రారంభించండి. ప్రతిరోజు ఉదయం, రాత్రి భోజనం చేసిన తర్వాత కొంత సేపు నడవాలి. ఇది బరువును నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. జాజికాయ పాలు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. వీటిని తయారుచేయడానికి ఒక కప్పు పాలలో పావు టీస్పూన్ జాజికాయ పొడిని కలుపుకుని గోరువెచ్చగా తాగాలి. ఇది కాకుండా ఆహారంలో ఫైబర్ కంటెంట్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కచ్చితంగా డైట్‌ మెయింటెన్ చేయాలి.

అజ్వైన్ నీరు బరువును నియంత్రించడానికి, చెడు కొవ్వు కరిగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఒక టేబుల్ స్పూన్ అజ్వైన్‌ గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. నీటిని ఫిల్టర్ చేసిన తర్వాత గోరువెచ్చగా తాగాలి. ఇది గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. కావాలంటే ఈ నీటిని రోజంతా తాగవచ్చు. లేదంటే కనీసం రెండు పూటలా తిన్నాక తాగాలి. తల్లిపాలు బిడ్డకే కాదు స్త్రీకి కూడా మేలు చేస్తాయి. ప్రసవానంతర బరువు తగ్గడానికి పిల్లలకి పాలు పడితే సరిపోతుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఒక మూడు నెలల క్రమంతప్పకుండా ఇలా చేస్తే కచ్చితంగా రిజల్ట్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories