Happy Friendship Day 2023: దోస్తులకు ఇలా శుభాకాంక్షలు చెప్పేద్దామా..!

Happy Friendship Day 2023 Wishes Messages Quotes Images Facebook Whatsapp Status in Telugu
x

Happy Friendship Day 2023: ఫ్రెండ్‌షిప్ డే థీమ్ ఏంటో తెలుసా? ఇలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోండి..!

Highlights

Friendship Day 2023 Wishes, Messages and Quotes: స్నేహం యొక్క సంబంధం పుట్టుకతో రాదు. దీనిని మనమే కనుగొనగలం. ఈ సృష్టించిన ఈ సంబంధం చాలా అందంగా ఉంటుంది.

Friendship Day 2023 Wishes, Messages and Quotes: స్నేహం యొక్క సంబంధం పుట్టుకతో రాదు. దీనిని మనమే కనుగొనగలం. ఈ సృష్టించిన ఈ సంబంధం చాలా అందంగా ఉంటుంది. దానిని మాటలలో వర్ణించడం సులభం కాదు. నిజమైన స్నేహితుడు సుఖం, దుఃఖం రెండింటిలోనూ సోదరుడిలా మీకు అండగా నిలుస్తాడు. మార్గదర్శి, గురువు లాంటివాడు. మీరు ఎవరితోనూ పంచుకోలేని విషయాలను మీ స్నేహితుడికి చెప్పుకుంటే, ఎంతో రిలాక్స్‌గా ఫీలవ్వచ్చు. నిజమైన స్నేహితుడు ఒక్కడుంటే, జీవితం చాలా ఆనందంగా ఉంటుందని అంటుంటారు.

అలాంటి స్నేహితుడికి ఫ్రెండ్‌షిప్ డే అంకితం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం నాడు భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఈఏడాది ఆగస్ట్ 6న ఫ్రెండ్‌షిప్ డే వచ్చింది. మీకు నిజమైన స్నేహితులు ఉంటే, వారికి ఈ సందేశాలను పంపి, ప్రత్యేఖంగా శుభాకాంక్షలు తెలియజేయండి.

20వ శతాబ్దంలో హాల్‌మార్క్ కార్డ్‌ సృష్టికర్త అయిన జాయిస్ హాల్ స్నేహాన్ని గుర్తుచేసుకునే రోజును నిర్ణయించారు. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ తొలి ఆదివారం నాడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం నిర్వహిస్తుంటారు.

2023 థీమ్..

`స్నేహంతో మానవ స్ఫూర్తిని చాటండి' అనేది స్నేహితుల దినోత్సవం 2023 థీమ్.

ఫ్రెండ్‌షిప్ డే 2023 మెసేజ్‌లు..

వెలుగులో ఒంటరిగా కాదు.. చీకటిలో స్నేహితుడితో నడవడానికి ఇష్టపడతాను. - హెలెన్ కెల్లర్

నా కష్ట సమయాల్లో, నా సంతోషంలో ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు. నీలాంటి మంచి స్నేహితుడి దొరికినందుకు నేను ప్రతిరోజూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.

మంచి స్నేహితులు నక్షత్రాల వంటివారు. వారిని ఎల్లప్పుడూ చూడలేం. కానీ, వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. అలాంటి స్నేహితుడిగా ఉన్నందుకు ధన్యవాదాలు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.

నిజమైన ప్రేమ ఎంతో అరుదు. అలాగే నిజమైన స్నేహం కూడా చాలా అరుదు. -జీన్ డి లా ఫోంటైన్

హే, బెస్ట్ ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. నేను ఇప్పటివరకు కలుసుకున్న వారిలో అత్యంత దయగల, హాస్యాస్పదమైన, అత్యంత సహాయకరమైన వ్యక్తివి నీవే. ఎప్పటికీ మనం ఇలాగే ఉందాం. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.


Show Full Article
Print Article
Next Story
More Stories