Haircare Tips: వేసవిలో ఎండ, చెమట వల్ల జుట్టు దెబ్బతింటుంది.. ఈ పద్దుతుల్లో సంరక్షించండి..!

Hair Gets Damaged Due to Sun and Sweat in Summer Take Care With These Tips
x

Haircare Tips: వేసవిలో ఎండ, చెమట వల్ల జుట్టు దెబ్బతింటుంది.. ఈ పద్దుతుల్లో సంరక్షించండి..!

Highlights

Haircare Tips: ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో అధిక ఎండవల్ల చెమట విపరీతంగా వస్తుంది.

Haircare Tips: ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో అధిక ఎండవల్ల చెమట విపరీతంగా వస్తుంది. ముఖ్యంగా దీనివల్ల జుట్టు మొత్తం పాడవుతుంది నిర్జీవంగా మారుతుంది. అందమైన జుట్టు అందరికి అవసరమే కానీ ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎండ, కాలుష్యం, మురికి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు నిర్జీవంగా మారుతుంది. అయితే ఎండాకాలం జుట్టుని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

1. జుట్టును కప్పి ఉంచండి

వేసవి కాలంలో అధిక ఎండకి జుట్టు దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో జుట్టును క్యాప్ లేదా గొడుగుతో కప్పుకోవాలి. ఇది జుట్టును సురక్షితంగా ఉంచుతుంది. బయటికి వెళ్లినప్పుడల్లా కచ్చితంగా జుట్టు కోసం సంరక్షణ చర్యలు చేపట్టాలి.

2. జుట్టును కత్తిరించడం

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా కత్తిరించడం అవసరం. దీని వల్ల చివర్లు చిట్లడం అనే సమస్య ఉండదు. నెలకోసారి తప్పనిసరిగా హెయిర్ ట్రిమ్మింగ్ చేయాలి.

3. నూనె రాయడం

నిర్జీవమైన జుట్టును కడగడానికి ముందు కొబ్బరి లేదా మరేదైనా నూనెతో మసాజ్ చేసి ఒక గంట తర్వాత జుట్టును కడగాలి. జుట్టు చాలా పొడిగా ఉంటే ముందు రోజు రాత్రి ఆయిల్ మసాజ్ చేసి మరుసటి రోజు షాంపూ చేయడం మంచిది. ఇది మీ జుట్టుకు మంచి తేమను అందిస్తుంది.

4. షాంపూ, కండీషనర్

ప్రతి ఒక్కరూ జుట్టు ఆరోగ్యానికి మంచి షాంపూ, కండీషనర్‌ వాడాలి. ఇందుకోసం రసాయనాలు లేని, సహజ పదార్థాలతో తయారు చేసిన షాంపూ,కండీషనర్‌ను ఎంచుకోవాలి. ఇది జుట్టు పొడిని తగ్గిస్తుంది. జుట్టును హైడ్రేట్ గా ఉంచుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories