Gunugu Pulu: బతుకమ్మ పేర్చడానికే కాదు.. ఆయుర్వేద గుణాలు మెండు..!

Gunugu Flowers Are Not Only For Bathukamma Festival They Can Cure Many Health Problems
x

Gunugu Pulu: బతుకమ్మ పేర్చడానికే కాదు.. ఆయుర్వేద గుణాలు మెండు..!

Highlights

Gunugu Pulu: గునుగు పూల పేరు వినబడగానే అందరికి బతుకమ్మ గుర్తుకొస్తుంది. ఎందుకంటే బతుకమ్మ పేర్చడానికి గునుగుపూలని కచ్చితంగా ఉపయోగిస్తారు.

Gunugu Pulu: గునుగు పూల పేరు వినబడగానే అందరికి బతుకమ్మ గుర్తుకొస్తుంది. ఎందుకంటే బతుకమ్మ పేర్చడానికి గునుగుపూలని కచ్చితంగా ఉపయోగిస్తారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ పూలలో ఔషధగుణాలు దాగి ఉంటాయి. ప్రాచీన కాలంలో దీనిని ఆయుర్వేదంలో వినియోగించేవారు. ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. గునుగు పూలతో బతుకమ్మని అందంగా పేర్చవచ్చు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

బీపీ కంట్రోల్​

ఆయుర్వేదంలో గునుకు పూలను విరివిగా ఉపయోగిస్తారు. ఇవి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి.

గాయాలు మానుతాయి

అప్పుడప్పుడు మనకు దెబ్బలు తగిలినప్పుడు అవి గాయాలుగా మారుతాయి. అయితే ట్యాబ్లెట్స్​కు బదులు గునుగు పూల పేస్ట్ ని రాస్తే త్వరగా మానుతాయి. గాయాలు తగిలినప్పుడు గునుగు పూలు ఫస్ట్ ఎయిడ్ గా పని చేస్తాయి.

క్షయ నివారణ

క్షయ వ్యాధి నివారణకు గునుగు పూలు చక్కగా పని చేస్తాయి. పూర్వం క్షయ వ్యాధికి గునుగు పూలను వాడే వారు. దగ్గు, డయేరియా వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు.

చర్మ సమస్యలు

గునుగు పూలు చర్మ సమస్యల నివారణకు చక్కగా పని చేస్తాయి. చర్మంపై మచ్చలు, డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.

జీర్ణ సమస్యలు దూరం

ప్రాచీన కాలంలో గ్రామాల్లో గునుగు పూలు, ఆకులను కూరగా వండుకుని తినేవారు. ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. మల బద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఇవి కాపాడుతాయి. రక్త విరోచనాలు, అతి స్రావం, రక్త స్రావం వంటి సమస్యలు తగ్గుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories