Diabetes Control Tips: ఈ చెట్టు ఆకులు మధుమేహానికి దివ్యౌషధం.. ప్రతిరోజూ 4 నమిలితే చాలు..!

Guava Leaves Are A Panacea For Diabetes Chewing 4 Leaves Every Day Keeps Blood Sugar Levels Under Control
x

Diabetes Control Tips: ఈ చెట్టు ఆకులు మధుమేహానికి దివ్యౌషధం.. ప్రతిరోజూ 4 నమిలితే చాలు..!

Highlights

Diabetes Control Tips: ప్రపంచంలో మధుమేహ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇక ఎప్పటికీ పోదు.

Diabetes Control Tips: ప్రపంచంలో మధుమేహ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇక ఎప్పటికీ పోదు. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. తప్పుడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల అన్ని వయసుల వారు దీని బారిన పడుతున్నారు. అయితే దీనిని ఔషధం, ఆహార నియమాలతో అదుపులో ఉంచవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జామ ఆకులు దివ్యౌషధం

మధుమేహ బాధితులు రాత్రి నిద్రపోయే ముందు జామ ఆకులను నమలడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల ఉదయం రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎప్పుడైనా జామ ఆకులను తినవచ్చు. కానీ రాత్రిపూట తినడం మంచిదిగా భావిస్తారు. దీనికి కారణం రాత్రి పూట జామ ఆకులు శరీరంలో జీర్ణమై పెరిగిన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అందువల్ల రాత్రిపూట మాత్రమే తినాలి.

ఆకులు నమలడానికి సరైన మార్గం

జామ ఆకులను నమలడం పట్ల శ్రద్ధ వహించడం అవసరం. దీని కోసం చిన్న, ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులను ఎంచుకోవాలి. 3 నుంచి 4 ఆకులను తీసుకొని వాటిని బాగా కడగాలి. తరువాత ఒక్కొక్కటిగా నమలడం కొనసాగించాలి. నమిలేటప్పుడు ఆకుల నుంచి రసం బయటకు వస్తుంది దానిని మింగాలి. తరువాత ఆకు మిగిలిన పిప్పిని ఉమ్మివేసి నోరు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories