Guava Side Effects: ఇలాంటి వ్యాధులు ఉంటే జామపండు తినకూడదు..!

Guava Fruit Should not be Eaten if there are Such Diseases the Problem Will Increase
x

Guava Side Effects: ఇలాంటి వ్యాధులు ఉంటే జామపండు తినకూడదు..!

Highlights

Guava Side Effects: ఇలాంటి వ్యాధులు ఉంటే జామపండు తినకూడదు..!

Guava Side Effects: శీతాకాలంలో జామపండ్లు ఎక్కువగా లభిస్తాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. జామపండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు జామపండు తినకూడదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. జామపండును ఏ వ్యక్తులు తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే అందులో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుందని అర్థం. దీని కారణంగా మధుమేహ పేషెంట్లకి ప్రయోజనకరంగా ఉంటుంది. జామ జీర్ణక్రియలో కూడా మేలు చేస్తుంది. ఇది అజీర్తిని కలిగించదు. కానీ విరేచనాలు వంటి వ్యాధులలో జామపండు తినకూడదు. జామపండులో ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య ఉన్నా జామపండు తినకూడదు.

జామకాయ తినడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది. దీనిని కొరికినప్పుడు దంతాలు, చిగుళ్లపై ఒత్తిడి పడుతుంది. నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు జామకాయ తింటునప్పుడు రక్తం కూడా వస్తుంది. సెన్సివిటీ సమస్యలతో బాధపడుతున్న రోగులు జామపండు తినకూడదు. నొప్పి, జలదరింపు సమస్య పెరుగుతుంది.

శస్త్రచికిత్సకు ముందు

జామపండు తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా గాయం మానడంలో సమస్య ఏర్పడుతుంది. శస్త్రచికిత్స వంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తే జామ తినకూడదు. శస్త్రచికిత్సకు చాలా రోజుల ముందు జామపండు తినడం మానేయాలి. జామపండు తినడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories