Beer Health Benefits: బీరు ప్రియులకు శుభవార్త.. మితంగా తాగితే శరీరానికి ఈ లాభాలుంటాయట..!

Good News For Beer Lovers If You Drink It In Moderation The Body Will Get These Benefits
x

Beer Health Benefits: బీరు ప్రియులకు శుభవార్త.. మితంగా తాగితే శరీరానికి ఈ లాభాలుంటాయట..!

Highlights

Beer Health Benefits: ఎండాకాలం వచ్చిందంటే బీరు ప్రియులకు పండుగే. ఎక్కడికి వెళ్లినా చల్ల చల్లటి బీర్లు కుమ్మేస్తుంటారు.

Beer Health Benefits: ఎండాకాలం వచ్చిందంటే బీరు ప్రియులకు పండుగే. ఎక్కడికి వెళ్లినా చల్ల చల్లటి బీర్లు కుమ్మేస్తుంటారు. ఇప్పటికే బీర్లు తాగడంలో రికార్డులు క్రియేట్‌ చేస్తున్నారు కూడా. అయితే చాలామంది బీరు తాగడం మంచిది కాదని చెబుతారు. ఎందుకంటే ఇందులో ఆల్కహాల్‌ ఉంటుంది. నిజానికి ఇది వాస్తవమే కానీ మితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బీర్‌లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బీర్ మితంగా తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెపోటు ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేస్తుంది. బీర్‌ మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. బీర్ కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. చాలా మంది కిడ్నీ స్టోన్ సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు బీర్‌ తాగితే కిడ్నీలో రాళ్లను కరిగించడంలో సాయపడుతుంది.

బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌ చేయడంలో బీర్‌ కీలకపాత్ర పోషిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే LDL మొత్తాన్ని తగ్గించడానికి, HDL మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సాయపడుతుంది. అయితే ఏదైనా మితంగా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అతిగా తీసుకుంటే అన్నమైనా విషమే అని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories