Health Tips: జిమ్‌కి వెళుతున్నారా.. ఈ 5 పదార్థాలు తింటే తక్షణ శక్తి పొందుతారు..!

Going To The Gym These 5 Ingredients Will Give You Instant Energy
x

Health Tips: జిమ్‌కి వెళుతున్నారా.. ఈ 5 పదార్థాలు తింటే తక్షణ శక్తి పొందుతారు..!

Highlights

Health Tips: బాడీ ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఇందులో రకరకాలుగాఉంటాయి. కొందరు రన్నింగ్‌, జాగింగ్‌ చేస్తే మరికొందరు యోగా, ఎక్సర్‌సైజ్‌ చేస్తారు.

Health Tips: బాడీ ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఇందులో రకరకాలుగాఉంటాయి. కొందరు రన్నింగ్‌, జాగింగ్‌ చేస్తే మరికొందరు యోగా, ఎక్సర్‌సైజ్‌ చేస్తారు. మరికొందరు జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తారు. అయితే వీరందరిలో జిమ్‌కు వెళ్లేవారికి ఎక్కువ ఎనర్జీ కావాలి. లేదంటే బలహీనంగా మారుతారు. జిమ్‌కు వెళ్లే ముందు వెళ్లి వచ్చిన తర్వాత సరైన డైట్‌ మెయింటెన్‌ చేయాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. జిమ్‌కు వెళ్లేవారు తీసుకోవాల్సిన డైట్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

వర్కవుట్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా మారుతుంది. వ్యాధుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అయితే జిమ్‌కు ఎప్పుడైనా పరగడుపుతో వెళ్లవద్దు. కప్పు ఓట్స్ తిని వెళ్లాలి. దీనివల్ల పదే పదే ఆకలి అనిపించదు. విటమిన్-బి, కార్బోహైడ్రేట్లు శరీరానికి అందుతాయి. జిమ్‌కి వెళ్లే ముందు తప్పనిసరిగా అరటిపండు తినాలి. ఇది శరీరంలో ఒక శక్తిని సృష్టిస్తుంది. దీని కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తొలగించడంలో సహాయం చేస్తుంది.

జిమ్‌కి వెళ్లే ముందు ఉడకబెట్టిన గుడ్లు తినాలి. ఇందులో ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా ఉంచడంలో, బలహీనతను దూరం చేయడంలో సహాయపడుతాయి. ఉడకబెట్టిన గుడ్లు తినలేకపోతే ఆమ్లెట్ వేసుకునైనా తినవచ్చు. రోజూ ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటివల్ల శరీరం బలహీనతకు గురికాదు. ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటారు.

డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, విటమిన్లు, కొవ్వు, పీచు పుష్కలంగా లభిస్తాయి. మీరు జిమ్‌కి వెళ్లే ముందు వీటిని తప్పనిసరిగా తినాలి. మీరు ఉడికించిన చికెన్ కూడా తినవచ్చు. ఇది శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. నల్ల మిరియాలు, ఉప్పు కలిపితే చాలా రుచిగా ఉంటుంది. వర్కవుట్ చేసే ముందు దీన్ని తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories