Goat Milk: ఆవు, గేదె కంటే మేక పాలు శక్తివంతమైనవి.. ఈ వ్యాధులకి దివ్యౌషధం..!

Goats Milk is More Powerful Than Cows and Buffalos
x

Goat Milk: ఆవు, గేదె కంటే మేక పాలు శక్తివంతమైనవి.. ఈ వ్యాధులకి దివ్యౌషధం..!

Highlights

Goat Milk: భారతదేశంలో పాలకి అతిపెద్ద వనరులు ఆవులు, గేదెలు. అన్ని వయసుల వారు వీటి పాలని తీసుకుంటారు.

Goat Milk: భారతదేశంలో పాలకి అతిపెద్ద వనరులు ఆవులు, గేదెలు. అన్ని వయసుల వారు వీటి పాలని తీసుకుంటారు. ప్రతిరోజు ఉదయమే పాలు లేనిది టీ, కాఫీలు ఉండవు. మధ్యాహ్నం పెరుగు, మజ్జిగ లభించవు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఆవులు, గేదెలు కాకుండా కొంతమంది మేకపాలు కూడా వినియోగిస్తారు. వీటి పాలు ఇతర జంతువుల పాల ఎక్కువ పోషకమైనవి. శరీరానికి అధిక బలాన్ని అందిస్తాయి. మేకపాల ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.

పాలు సంపూర్ణ ఆహారం. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. అయితే ఆవు, గేదె పాలు తాగేవారిలో కంటే మేకపాలు తాగేవారిలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి. మేక పాలు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. డెంగ్యూ జ్వరం, శారీరక బలహీనత, ఇన్ఫెక్షన్, బోలు ఎముకల వ్యాధి, చేతులు, కాళ్లలో తిమ్మిర్లు మొదలైన వ్యాధులని నివారించవచ్చు. విటమిన్ A మన కంటి చూపును పెంచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. 100 ml మేక పాలలో 125 IU విటమిన్ A ఉంటుంది. ఇది ఆవు-గేదె పాల కంటే చాలా ఎక్కువ.

ఫుడ్ డేటా సెంట్రల్ ఆఫ్ అమెరికా ప్రకారం 100 మిల్లీలీటర్ల ఆవు-గేదె పాలలో 3.28 గ్రాముల ప్రోటీన్, 123 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కానీ 100 మిల్లీలీటర్ల మేక పాలలో 3.33 గ్రాముల ప్రోటీన్, 125 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. వాస్తవానికి విటమిన్ డి అనేది సూర్యకాంతి ద్వారా పొందవచ్చు. కానీ కొన్నిదేశాలలో శీతాకాలంలో సూర్యుడు నెలల తరబడి కనిపించడు. అప్పుడు ఈ పోషకాన్ని ఆహార పదార్థాల ద్వారా పొందవలసి ఉంటుంది. 100 ml మేక పాలలో 42 IU విటమిన్ డి లభిస్తుంది. అందుకే ఆయా దేశాలలో మేకపాలని ఎక్కువగా ఉపయోగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories