Kitchen Hacks: ఈ 5 పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. అవసరం లేదంటోన్న అధ్యయనాలు.. అవేంటో తెలుసా?

From Mustard Sauce to Butter These 5 Foods not Kept in Refrigerator Check Full List
x

Kitchen Hacks: ఈ 5 పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. అవసరం లేదంటోన్న అధ్యయనాలు.. అవేంటో తెలుసా?

Highlights

Kitchen Hacks: ప్రతి ఆహారాన్ని ఫ్రిజ్‌లో మాత్రమే నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచకపోయినా తినదగిన ఆహారపదార్థాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Kitchen Hacks: మన భారతీయ ఆహారాలతో ఊరగాయ లేదా చట్నీ లేకుంటే, వాటి రుచి అసంపూర్ణంగా ఉంటుందని అంటుంటారు. చింతపండు చట్నీని దేశీ చాట్ స్టాల్స్‌లో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్రిజ్‌లో ఊరగాయ లేదా చట్నీ వంటి కొన్ని ఆహారపదార్థాలను ఉంచడం సరికాదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ప్రతి ఆహార పదార్థాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో ఉంచినా ఫర్వాలేదు. కానీ, వెనిగర్, నూనె, చక్కెర, ఉప్పుతో చేసిన కొన్ని వస్తువులను గది ఉష్ణోగ్రత వద్ద కూడా నిల్వ చేయవచ్చు. అలాంటి 5 ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మాంసం, చేపలు, గుడ్లు 40 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ఉంచవచ్చని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పేర్కొంది. కానీ, ప్రతి ఆహారాన్ని ఫ్రిజ్‌లో మాత్రమే నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచకపోయినా తినదగిన ఆహారపదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఆవాల సాస్..

ఇది సహజంగా ఆమ్లంగానే ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచకపోయినా వాడుకోవచ్చు. దీనిని చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయవచ్చు.

ఊరగాయ..

ఫ్రిజ్‌లో ఊరగాయలను నిల్వ ఉంచడం చాలా మందికి అలవాటు. కానీ, ఊరగాయలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. ఇది చాలా కాలం పాటు ఉండేందుకు.. ఇందులో అనేక సుగంధ ద్రవ్యాలు, నూనెలు వేస్తుంటారు. కాబట్టి వీటిని బయట పెట్టుకున్నా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదంట.

సోయా సాస్..

చాలా మంది సోయా సాస్‌ను ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. కానీ, ఇది చాలా తప్పు. సోయా సాస్‌ను ఫ్రిజ్ నుంచి తీసి రెండు సంవత్సరాల వరకు బయట ఉంచినా ఏం కాదంట.

వెన్న..

వెన్న ఒక పాల ఉత్పత్తి అయినప్పటికీ, గది ఉష్ణోగ్రతలో కూడా వెన్న బాగానే ఉంటుందంట.

ఆలివ్ నూనె..

గది ఉష్ణోగ్రత వద్ద ఆలివ్ నూనెను కూడా నిల్వ చేయవచ్చు. సీసాలో ఆలివ్ ఆయిల్ పోసి, చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేస్తే చాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories