Refrigerator: ఎలాంటి పదార్థలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో తెలుసా?

Foods you Should not Keep in Refrigerator
x

Representational Image

Highlights

Refrigerator: కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయని ఆరోగ్య నిఫుణులు చెప్తున్నారు

Refrigerator: ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది. సాధారణంగా తాజా ఫ్రూట్స్, వెజిటబుల్స్, మందులు లాంటివి ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు అనుకూలం. ప్రిడ్జ్ సద్ది పెట్టె అని నానుడి కూడా వుంది. దానికి కారణం మిగిలిన ఆహార పదార్థలన్నింటిని అందులో పెట్టడమే. ఈ మథ్య కాలంలో దాని వాడకం గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి అవగాహనకు రండి. ఎలాంటి ఆహారాలు, ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో ఇప్పుడు 'లైఫ్ స్టైల్' లో చూద్దాం.

పుచ్చకాయను ఫ్రిజ్ లో పెడితే దాని లోని పోషకాలు అన్నీ పోతాయంట. అయితే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలితే వాటిని బయట మాత్రం ఉంచకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే పుచ్చకాయ కోసిన తర్వాత ముక్కలు మిగిలిపోతే కేవలం రెండు గంటల్లోనే పాడైపోయే అవకాశం ఉంటుంది ఇలా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే పోషకాలు వద్దనుకుంటే పుచ్చకాయ ఫ్రిజ్ లో పెట్టడం బెటర్.

టమోటాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఆశ్చర్యంగా ఉందా ? నిజమే వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ మిస్సవుతుంది. అలాగే త్వరగా పండుతాయి. కాబట్టి బయటే పేపర్ బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిది. బంగాళదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ పై దుష్ర్పభావం చూపుతాయి. కాబట్టి పేపర్ బ్యాగ్స్ లో పెడితే.. తాజాగా ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెట్టడం కూడా మంచిది కాదని గుర్తుంచుకోండి. త్వరగా కుళ్లిపోతాయి. అయితే చాలామంది ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి పెడుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. బంగాళాదుంపలు విడుదల చేసే మాయిశ్చరైజర్ వల్ల ఉల్లిపాయలు దెబ్బతింటాయి.

సాధారణంగా బ్రెడ్ ని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అది త్వరగా డ్రై అవుతుంది. దీనివల్ల బ్రెడ్ తినడానికి ఫ్రెష్ గా అనిపించదు. కాబట్టి రూమ్ టెంపరేటర్ లో పెట్టాలి. లేదా చల్లగా ఉండే కప్ బోర్డ్ లో లేదా బ్రెడ్ బాక్స్ లో పెడితే.. ఫ్రెష్ గా ఉంటుంది.

అవకాడో, యాపిల్స్, అరటిపండ్లు, నారింజ, బెర్రీస్, పీచ్, ఆప్రికాట్ వంటి ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. అయితే మీరు చల్లగా తినాలి అనుకుంటే.. తినడానికి అరగంట ముందు పెట్టుకోవాలి. అయితే ఆరంజ్, నిమ్మకాయలను రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవడం మంచిది. కట్ చేసిన అవకాడో ఫ్రూట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

వెల్లుల్లిలో ఉండే ఫ్లేవర్, సువాసన ఫ్రిడ్జ్ లో పెడితే తగ్గిపోతుంది. అలాగే త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటే పెట్టుకోవాలి. గుమ్మడి జాతికి చెందిన ఎలాంటి కూరగాయలనైనా.. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి కూరగాయలను రూం టెంపరేచర్ లో పెట్టడం మంచిది.

కాఫీని ఎయిర్ టైట్ కంటెయినర్ లో పెట్టడం వల్ల చాలా మంచి వాసన, తాజాగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. తేనె ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్. అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే.. గట్టిగా అవుతుంది. కాబట్టి రూం టెంపరేచర్ లో పెట్టుకోవాలి. అయితే సూర్య రశ్మి తగలకుండా పెట్టడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories