Health Tips: కోవిడ్ బారిన పడ్డరా.. చికిత్సతోపాటు వీటిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు..!

Follow These Tips To Recovering from Covid-19 | Corona Health Care Tips
x

Health Tips: కోవిడ్ బారిన పడ్డరా.. చికిత్సతోపాటు వీటిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు..!

Highlights

Health Tips: కరోనా వైరస్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. మనదేశంలోనూ విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి.

Health Tips: కరోనా వైరస్ మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. మనదేశంలోనూ విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే కరోనా నుంచి చాలమంది కోలుకుంటున్నారు. కరోనా వచ్చినకం చికిత్సలతో అది నయమవుతున్నా.. ఆ తర్వాత అది శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, కరోనా రోగులు త్వరగా కోవిడ్-19 నుంచి కోలుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారు త్వరగా కోలుకోవడానికి కొన్ని చిట్కాలను అనుసరించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సూర్యోదయపు కాంతి మంచింది - ఉదయం సూర్యకాంతి మిమ్మల్ని రీఫ్రెస్ చేస్తుంది. ఇది ఒక సహజ మార్గం. విటమిన్ డి స్థాయిలను అదుపులో ఉంచుకోండి. దీని కోసం, ప్రతిరోజూ ఉదయాన్నే లేచి 15 నిమిషాలు సూర్యరశ్మిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి - రాగులు, రాంచెరా వంటి ఆహార పదార్థాలు కోవిడ్-19 తర్వాత కోలుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇందులో కాల్షియం, ఫాస్పరస్ లాంటి అద్భుతమైన మూలాలు ఉన్నాయి. నువ్వులు కూడా తినాలి. ఈ పోషకాలన్నీ ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.

కషాయాలను అధికంగా తీసుకోవడం మానుకోండి - అన్ని మూలికలు అందరికీ సరిపోవు. కాబట్టి కషాయాలను అధికంగా తీసుకోవద్దు. ముఖ్యంగా వేసవి రోజుల్లో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు, డికాక్షన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ సమస్యలు కూడా రావచ్చు.

పసుపు పాలు తీసుకోండి - రాత్రి నిద్రిస్తున్నప్పుడు పసుపు పాలు తీసుకోండి. ఆయుర్వేదం ప్రకారం, పడుకునే ముందు పసుపు పాలను తీసుకోవడం వల్ల శరీరానికి మంచి విశ్రాంతితోపాటు మంచి నిద్రను అందింస్తుంది. త్వరగా రాత్రి భోజనం చేయండి- సూర్యాస్తమయానికి దగ్గరగా రాత్రి భోజనం చేయడానికి ప్రయత్నించండి. ఇది రాత్రి భోజనాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories