Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఇవి చేయాల్సిందే..!

Follow these tips to keep your heart healthy
x

Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఇవి చేయాల్సిందే..!

Highlights

Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఇవి చేయాల్సిందే..!

Heart Health: ఈ రోజుల్లో చాలా రకాల గుండె సమస్యలు తెరపైకి వస్తున్నాయి. వీటిని నివారించాలంటే ముందుగా గుండెని ఆరోగ్యంగా చూసుకోవాలి. నేటి కాలంలో కాలుష్యం వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండెపై చెడు ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కొన్ని విషయాలపై జాగ్రత్త తీసుకోవాలి. గుండెను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోండి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు తీసుకోవడం తప్పనిసరి.. శరీరాన్ని హైడ్రేట్ చేయకుండా వ్యాయామం చేస్తే రక్తం చిక్కగా మారుతుంది. దీనివల్ల గడ్డకట్టే సమస్యలకు కారణం అవుతుంది. దీంతో పాటు నీటి కొరత ఒత్తిడిని కలిగిస్తుంది.

పరీక్ష చేయించుకోండి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే 30 ఏళ్ల తర్వాత ఏడాదికి రెండుసార్లు గుండె పరీక్ష చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలానికి ముందే వ్యాధులను నయం చేసుకోవచ్చు.

రోజూ వ్యాయామం చేయాలి

రోజూ 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో గుండె జబ్బులే కాకుండా రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటివి దూరం చేసుకోవచ్చు. మీరు ఇప్పటికే గుండె రోగి అయితే తీవ్రమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

కొవ్వును తగ్గించండి

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొవ్వుకు దూరంగా ఉండాలి. ట్రాన్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అందుకే గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ముందుగా ఊబకాయాన్ని అదుపులో పెట్టుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories