Health Tips: రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. ఈ చిట్కాలు పాటిస్తే గాడ నిద్రలోకి వెళుతారు..!

Follow These Tips for a Good Nights Sleep
x

Health Tips: రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదా.. ఈ చిట్కాలు పాటిస్తే గాడ నిద్రలోకి వెళుతారు..!

Highlights

Health Tips: ఒక రోజులో 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

Health Tips: ఒక రోజులో 8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. లేదంటే రోజులో చేసే కార్యకలాపాలు మొత్తం కష్టమవుతాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపోని వ్యక్తులు రోజంతా అలసిపోయినట్లు కనిపిస్తారు. ముఖం వాడిపోయి ఉంటుంది. నిద్ర పట్టకపోవడానికి కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాలు ఉంటాయి. వాటిని సరిచేసుకుంటే మంచి నిద్ర మీ సొంతమవుతుంది. అలాంటి కొన్ని చిట్కాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

దిండు సమస్య

కొంతమందికి దిండు అంటే చాలా ఇష్టం. వారు నిద్రించడానికి ఒకటి కాదు అనేక దిండ్లను ఉపయోగిస్తారు. మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎక్కువ దిండ్లు ఉపయోగించడం వల్ల మెడ నొప్పిగా ఉంటుంది. అంతేకాదు మీరు గురక పెట్టడం ప్రారంభిస్తారు. నిద్ర కూడా చెదిరిపోతుంది.

సరైన బెడ్‌

చాలా సార్లు బెడ్‌ అడుగు భాగం గొయ్యిలా తయారవుతుంది. అయినప్పటికీ కొంతమంది అందులోనే పడుకుంటారు. దీనివల్ల నడుంనొప్పి మొదలవుతుంది. ఇలాంటి పరుపులని సరిచేసుకోవాలి. లేదంటే నిద్ర సరిగ్గా పట్టదు. ఏ బెడ్‌ కైనా వ్యాలిడిటీ ఉంటుంది. మాట్రిస్‌ పాతదికాగానే కొత్త మాట్రిస్ కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి.

మంచి పాటలు

అలసట కారణంగా నిద్రలేకపోతే ముందుగా మనసుని రిలాక్స్‌ చేయండి. ఇందుకోసం మృదువైన సంగీతాన్ని వినండి. అది మీ మనసుని శాంతింపజేస్తుంది. మీరు బాగా నిద్రపోవడం ప్రారంభిస్తారు.

ప్రతిరోజు ఒకే సమయం

మీరు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోండి. ఇందులో మార్పులు చేయవద్దు. దీనివల్ల నిద్ర చక్రం మనస్సులో స్థిరంగా ఉంటుంది. సమయానికి నిద్ర అదే వస్తుంది. నిద్ర పోవడంలో ఎటువంటి సమస్య ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories