Water Heater: వాటర్‌ హీటర్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలా? ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి..!

Follow These Natural Tips to Remove White Coating on Water Heater
x

Water Heater: వాటర్‌ హీటర్‌ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలా? ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి..!

Highlights

Water Heater: చలికాలం దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో వాటర్‌ హీటర్‌ను ఉపయోగించాల్సిందే. కాస్త డబ్బులు ఎక్కువగా ఉన్న వారు, బాత్‌రూమ్‌లో పైప్‌ ఫిట్టింగ్స్ ఉన్న వారు అయితే గీజర్‌లను ఉపయోగిస్తుంటారు.

Water Heater: చలికాలం దాదాపు ప్రతీ ఒక్కరి ఇంట్లో వాటర్‌ హీటర్‌ను ఉపయోగించాల్సిందే. కాస్త డబ్బులు ఎక్కువగా ఉన్న వారు, బాత్‌రూమ్‌లో పైప్‌ ఫిట్టింగ్స్ ఉన్న వారు అయితే గీజర్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ మెజారిటీ మాత్రం వాటర్‌ హీటర్‌ రాడ్లపైనే ఆధారపడి పడుతుంటారు. అయితే వాటర్‌ హీటర్‌ రాడ్‌లను ఉపయోగించే సమయంలో కొన్ని రోజులకు రాడ్‌పై తెల్లగా పేరుకుపోవడం గమనించే ఉంటాం. ఇంతకీ అసలు ఇలా ఎందుకు జరుగుతుంది, దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా.? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మనం ఉపయోగించే నీటిలో సోడియం కంటెంట్‌ ఉంటుంది. మరీ ముఖ్యంగా బోర్‌ వాటర్‌లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో వాటర్‌ రాడ్‌పై తెల్లగా పేరుకుపోతుంది. దానిని అలాగే వదిలేసి నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తే కరెంట్ బిల్లు ఎక్కువ రావడంతో పాటు నీరు కూడా త్వరగా వేడెక్కదు. అందుకే దీనిని తొలగించేందుకు కొన్ని నేచురల్‌ టిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఈ టిప్స్ ఏంటేంటే.

* వాటర్‌ రాడ్‌పై పేరుకుపోయిన తెల్లటి పొరను తొలగించడంలో వెనిగర్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా ఒక కంటైనర్‌లో కొంత నీరు తీసుకోవాఇల. అనంతరం ఆ నీటిలో వెనిగర్‌ను వేసి కలపాలి. ఆ తర్వాత నీటిలో వాటర్‌ రాడ్‌ను అలాగే పెట్టి 15 నుంచి 20 నిమిషాలు ఉండేలా చూసుకోవాలి. తర్వాత రాడ్‌ను బయటకు తీసి సాఫ్ట్‌ క్లాత్‌తో రుద్దేసే సరిపోతుంది. తెల్లటి పొర తొలగిపోతుంది.

* హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కూడా రాడ్‌ను శుభ్రపరచవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక బకెట్‌లో నీరు తీసుకోవాలి. అనంతరం అందులో 2 టీస్పూన్ల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి కలపాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు అందులో రాడ్‌ వేయాలి. తర్వాత రాడ్‌ను బయటకు తీసి శుభ్రంగా రుద్దాలి ఇలా చేస్తే తెల్లటి పొర ఇట్టే తొలగిపోతుంది. తర్వాత రాడ్‌ను శుభ్రంగా నీటితో కడిగేస్తే సరిపోతుంది.

* వాటర్‌ రాడ్‌పై పేరుకుపోయిన తెల్లటి పొరను తొలగించేందుకు నిమ్మరసం, బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. నిమ్మరసం, బేకింగ్ సోడాను మిక్స్‌ చేసిన పేస్ట్‌లాగా తయారు చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని రాడ్‌కు బాగా పట్టించి. 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత రాడ్‌ని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే వాటర్‌ రాడ్‌పై పేరుకుపోయిన తెల్లటి పొర తొలగిపోతుంది.

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. విద్యుత్ సహాయంతో నడిచే వాటర్ హీటర్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా కరెంట్‌ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories