Lifestyle: ఇంట్లో బల్లులు భయపెడుతున్నాయా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..!

Follow these natural tips to remove lizards from home in telugu
x

Lifestyle: ఇంట్లో బల్లులు భయపెడుతున్నాయా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి 

Highlights

లెక్కకు మించిన బల్లులు ఇంట్లో తిరుగుతుంటే చూడ్డానికి భయంగా ఉంటుంది. అలాగే బల్లులు ఆహార పదార్థాలపై తిరిగినా, విసర్జించినా అనారోగ్య సమస్యలు వస్తాయి.

ఇంట్లో బల్లులు కనిపించడం సర్వసాధారణమైన విషయం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ బల్లులు పెద్దగా ఇబ్బందిగా మారకపోయినా, మరికొన్ని సమయాల్లో మాత్రం ఇబ్బందులు పెడుతుంటాయి. లెక్కకు మించిన బల్లులు ఇంట్లో తిరుగుతుంటే చూడ్డానికి భయంగా ఉంటుంది. అలాగే బల్లులు ఆహార పదార్థాలపై తిరిగినా, విసర్జించినా అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఇంట్లో పెరిగిపోయే బల్లులను సహజ పద్ధతుల ద్వారా ఎలా తరిమికొట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

* నల్ల మిరియాలు బల్లులను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మిరియాలను పొడిగా మార్చి, నీటిలో కలపాలి. అనంతరం ఒక బాటిల్‌లో ఈ నీటిని పోసి బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో స్ప్రే చేస్తే సరిపోతుంది. బల్లులు అటువైపు రాకుండా ఉంటాయి.

* దుస్తులు వాసన రాకుండా ఉండడానికి ఉపయోగించే నాఫ్తలీన్‌ గోలీలు కూడా బల్లులను తరిమికొట్టడంలో ఉపయోగపడతాయి. బల్లులు నాఫ్తలీన్‌ వాసనను తట్టుకోలేవు. ఇవి ఉన్న చుట్టుపక్కాల ప్రాంతాల్లో బల్లులు సంచరించవు.

* కోడి గుడ్డు పొట్టు కూడా బల్లులు దరిచేరకుండా ఉంచడంలో ఉపయోగపడుతుంది. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో కోడి గుడ్డు పెంకును వేయాలి ఇలా చేయడం వల్ల బల్లులు అటువైపు రాకుండా ఉంటాయి.

* ఉల్లిపాయలు, వెల్లులి కూడా బల్లులను తరిమికొట్టడంలో ఉపయోగపడుతుంది. ఉల్లి, వెల్లుల్లిని ముక్కలుగా కోసి ఇంటి మూలలో ఉంచాలి. వీటి ఘాటుకు బల్లులు దరిచేరకుండా ఉంటాయి.

* బల్లులు ఎక్కువగా ఉండే చోట కర్పూరం పొడి చల్లినా బల్లులు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కర్పూరం బిళ్లలు పెడితే బల్లులు పరార్‌ అవుతాయి.

* నెమలి ఈకలు పెట్టడం ద్వారా కూడా బల్లులు పరార్‌ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒకటి రెండు కాకుండా ఒక 4 లేదా 5 నెమలి కనులు ఉన్నవి పెడితే బల్లులు బయపడి ఆ చోటకి రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories