Cracked Heel: చలికాలం పాదాలు పగులుతున్నాయా.? ఈ సింపుల్ టిప్స్‌ పాటించండి..!

Follow These Natural Tips to Overcome From Cracked Heels in Winter
x

Cracked Heel: చలికాలం పాదాలు పగులుతున్నాయా.? ఈ సింపుల్ టిప్స్‌ పాటించండి..!

Highlights

How To Get Rid Of Cracked Heel: చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల్ల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది.

How To Get Rid Of Cracked Heel: చలికాలంలో కనిపించే ప్రధాన సమస్యల్లో మడమల్ల పగుళ్లు ఒకటి. చలి కాలంలో పొడి గాలుల కారణంగా మడమల చర్మంలో తేమ తగ్గుతుంది. ఈ కారణంగా చర్మం పొడిగా మారి పాదాలలో పగుళ్లు ఏర్పడుతాయి. పగిలిన మడమల కారనంగా నొప్పి, ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే క్రీములను ఉపయోగిస్తుంటారు. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది.? ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో మడమలు ఎక్కువగా పొడిబారడం, చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోవడం మడిమలు పొడిబారుతాయి. శీతాకాలంలో చల్లని గాలులు మడమల చర్మంలోకి లోతుగా వెళ్తాయి. దీని కారణంగా చర్మం తేమను కోల్పోతుంది, మడమల్లో పగుళ్లు ఏర్పడడానికి ఇదే ప్రధాన కారణం. అంతేకాకుండా చలికాలంలో ఎక్కువగా వేడి నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇది కూడా చర్మంలోని సహజ తేమను తొలగిస్తుంది. దీంతో పాదాల్లో పగుళ్లు ఏర్పడుతాయి.

ఇంటి చిట్కాలు..

* పగిలిన మడమల సమస్య నుంచి బయటపడాలంటే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ అప్లై చేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. దీంతో మడమలు మృదువుగా మారుతాయి. రోజుకు కనీసం రెండుసార్లు మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి.

* వారానికి ఒక్కసారైనా సున్నితంగా ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ కణాలను తొలగిపోతాయి. మృదువైన చర్మం వస్తుంది. ఇందుకోసం సాఫ్ట్‌ పెడిక్యూర్‌ను ఉపయోగించవచ్చు.

* ఒకవేళ మీ మడమలు ఇప్పటికే పగిలి ఉంటే పాదాలకు రెగ్యులర్‌గా వాస్లెన్‌ అప్లై చేయాలి. అనంతరం రాత్రంగా సాక్స్‌లను ధరించాలి. ఇలా చేయడం వల్ల మడమలలో తేమ శాతం పెరుగుతంది. ఇది పొడి చర్మం సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

* చలికాలంలో ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అయితే ఇది కూడా మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయాలని సూచిస్తున్నారు.

* డీహైడ్రేషన్‌ కూడా పాదాలు పగలడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. చలికాలం సాధారణంగానే నీటిని తక్కువగా తీసుకుంటారు. అయితే కాలంతో సంబంధం లేకుండా నీటిని తీసుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories