Constipation: మలబద్ధకంతో విసిగిపోయారా.? వెంటనే రిలిఫ్‌ కావాలంటే..

Follow these natural tips for Constipation problem in telugu
x

Constipation: మలబద్ధకంతో విసిగిపోయారా.? వెంటనే రిలిఫ్‌ కావాలంటే.. 

Highlights

మలబద్ధకం సమస్య మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు చాలా మంది రకరకాల మందులను ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం మలబద్ధకం బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగింది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడితో కూడుకున్న జీవితం, శారీరర శ్రమ లేకపోవడం వల్ల చాలా మందిలో ఈ సమస్య కనపిస్తోంది. మలబద్ధకం సమస్య మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు చాలా మంది రకరకాల మందులను ఉపయోగిస్తున్నారు. దీంతో ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. మరి సహజంగా ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు, గోధుమలు, బీన్స్ వంటి పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

* ఇక సరిపడ నీటిని తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.

* రోజులో కచ్చితంగా కాసేపైనా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు చేయాలి.

* ఇక తీసుకునే ఆహారం సమయంలో విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. రోజూ ఒకే సమయంలో ఆహారం తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది.

* చాలా మందిలో నిద్రలేమి కారణంగా కూడా జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రోజు కచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

* వీటితో పాటు నువ్వుల నూనె కూడా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు ఒక చెంచా నువ్వుల నూనెను తీసుకోవాలి. దీంతో ఉదయం లేవగానే సుఖ విరోచనం అవుతుంది.

* ఇక పండ్లను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబతుతున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక పండును తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా అరటి పండును రోజుకు ఒకటి తీసుకుంటే మలబద్ధకం సమస్య బలాదూర్‌ అవుతుంది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. గూగుల్‌తో పాటు ఇతర వేదికల్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories