Good Mental Health: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ 4 అలవాట్లు పాటించండి.. అవేంటంటే..?

Follow these Good Habits for Good Mental Health Learn About Them
x

Good Mental Health: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఈ 4 అలవాట్లు పాటించండి.. అవేంటంటే..?

Highlights

Good Mental Health: మనిషి ఆలోచన విధానం సరిగ్గా ఉండాలంటే అతడు మానసికంగా ధృడంగా ఉండాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.

Good Mental Health: మనిషి ఆలోచన విధానం సరిగ్గా ఉండాలంటే అతడు మానసికంగా ధృడంగా ఉండాలి. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ, కుటంబ బాధ్యతలు మోస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. వీటి నుంచి బయటపడాటానికి స్వల్ప ఆనందం కోసం చెడు అలవాట్లకి బానిసవుతున్నారు. అయితే చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని చాలామందికి తెలియదు. కొన్నిసార్లు మెదడు పని చేయకుండా ఆలోచనా శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు రావొద్దంటే ఈ తప్పులని నివారించండి.

బ్రేక్ ఫాస్ట్ మానేయవద్దు

చాలామంది ఉదయాన్నే స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్ కి వెళ్లాలనే తొందరలో ఉంటారు. దీని వల్ల బ్రేక్ ఫాస్ట్ చేయకుండా వెళుతారు. ఈ అలవాటు సరైనది కాదు ఎందుకంటే ఇది మెదడు బలహీనతకి కారణమవుతుంది. అందుకే ఏ సందర్భంలోనైనా టిఫిన్‌ చేసే బయటికి వెళ్లాలి.

తీపిపదార్థాలు ఎక్కువగా తినవద్దు

తీపి పదార్ధాల రుచిని అందరు ఇష్టపడుతారు. ఇవి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌, ఐస్ క్రీమ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా కొబ్బరి నీరు, ఖర్జూరం వంటి సహజ చక్కెర ఉన్న వాటిని తినాలి.

ఎక్కువగా కోపం తెచ్చుకోవద్దు

ఎక్కువ కోపం మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భావోద్వేగాలను నియంత్రించడం అవసరం. ఎందుకంటే ఇది మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. మానసిక సమస్యలను మరింత పెంచుతుంది.

సరైన నిద్రపోవాలి

జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్రను తీసుకోవాలి. ఆరోగ్య నిపుణులు రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు. లేదంటే మెదడు సరిగ్గా పని చేయదని హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర లేకుంటే మరునాడు ఏ పని చేయలేము. ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది. అంతేకాదు చాలా బద్దకంగా తయారవుతారు. అందుకే రోజుకి కనీసం 8 గంటల నిద్రపోవాలి. ఇదే ఆరోగ్యానికి మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories