Fitness: బరువు తగ్గాలనుకుంటే.. ఈ 5 పండ్లు తినడం తగ్గించాల్సిందే.. ఎందుకో తెలుసా?

Fitness: బరువు తగ్గాలనుకుంటే.. ఈ 5 పండ్లు తినడం తగ్గించాల్సిందే.. ఎందుకో తెలుసా?
x

Fitness: బరువు తగ్గాలనుకుంటే.. ఈ 5 పండ్లు తినడం తగ్గించాల్సిందే.. ఎందుకో తెలుసా?

Highlights

Weight Loss Food: బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. బరువు తగ్గడానికి, మీకు డైటింగ్‌తోపాటు వ్యాయామం కూడా అవసరం.

Weight Loss Food: బరువు తగ్గాలంటే చాలా కష్టపడాలి. బరువు తగ్గడానికి, మీకు డైటింగ్‌తోపాటు వ్యాయామం కూడా అవసరం. చాలామంది మొదట్లో ఉత్సాహంగా డైటింగ్ చేయడం ప్రారంభిస్తారు. కానీ, 10 రోజుల తర్వాత తమ పాత లైఫ్‌కి తిరిగి వస్తారు. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంతో అవసరం. ఇందులో ఆహారంతోపాటు వ్యాయామం కూడా ఉండాలి. బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని పండ్లను కూడా తీసుకోవాలి. అయితే ఈ లిస్టులో తీసుకోకూడని పండ్లు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గాలంటే ఈ 5 పండ్లను తినవద్దు..

1- పైనాపిల్- పైనాపిల్ ఆరోగ్యకరమైన పండు. కానీ, బరువు తగ్గాలనకుంటే మాత్రం మీరు దానిని తినకూడదు. పైనాపిల్ చాలా తీపిగా ఉంటుంది. ఇందులో ఉండే క్యాలరీలు బరువు తగ్గడాన్ని కష్టతరం చేస్తాయి.

2- అవోకాడో- బరువు తగ్గేటప్పుడు మీరు అధిక కేలరీల పండ్లు తినకూడదు. అవోకాడో కూడా అధిక కేలరీల పండ్ల లిస్టులో ఉంటుంది. 100గ్రాములు ఉన్న ఈ పండులో దాదాపు 160 కేలరీలు ఉంటాయి. అవోకాడో ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలంగా ఉంటుంది. అందుకే మీరు దీన్ని పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.

3- ద్రాక్ష - ద్రాక్షలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. అందువల్ల, బరువు తగ్గేటప్పుడు, మీరు ద్రాక్షను తక్కువ పరిమాణంలో తినాలి. 100 గ్రాముల ద్రాక్షను తింటే, అందులో 67 కేలరీలు, 16 గ్రాముల చక్కెర ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ బరువు తగ్గించే ప్రణాళిక పాడవుతుంది.

4- అరటిపండు- అరటిపండు ఒక సూపర్-హెల్తీ ఫ్రూట్. కానీ, మీరు అరటిపండును ఎక్కువగా తింటే, బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. అరటిపండ్లు కేలరీలు, సహజ చక్కెరకు మూలంగా ఉంటుంది. అరటిపండులో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు రోజుకు 2-3 అరటిపండ్లు తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

5- మామిడిపండ్లు- మామిడి పండ్లను అందరూ ఇష్టపడతారు. కానీ, మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు మామిడిపండ్లను తినకూడదు. ఒకవేళ తినాలనుకంటే మాత్రం కేవలం 1-2 ముక్కల కంటే ఎక్కువ తినవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories